Johnny kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలమే అవుతోంది. ఇప్పటివరకు ఆమెకు చెప్పుకోదగిన హిట్ ఏదీ పడలేదు. బాలీవుడ్లో నటించిన చాలా సినిమాలు థియేటర్ కి కాకుండా ఓటీటీకే పరిమితం అయ్యాయి. మంచి హిట్ పడకపోతే, ఆమె కెరీర్‌కి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. జాన్వీకి స్టార్ డమ్ రావాలంటే, బ్లాక్ బస్టర్ హిట్ పడాల్సిందే.
బాలీవుడ్‌కే పరిమితం కావాలనే నిర్ణయాన్ని మార్చుకుని తెలుగులో ఓ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నాడు. మరో సినిమా కి జాన్వీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నిర్మాతలు జాన్వీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సైన్ చేయాలా వద్దా అనే విషయంలో జాన్వీ కన్ఫ్యూజన్లో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. మేకర్స్ ఆమెను సంప్రదించడానికి ముందు ఆమె OTTలో క్రేజీ షో కోసం తేదీలను ఇచ్చింది. ఆమె తన డేట్లను సర్దుబాటు చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ డైలమా నుంచి బయటపడితే కానీ, ఆమె మూవీకి ఓకే చేసే అవకాశం లేదు.