»Young Hero As The Best Actress Interesting Dream Girl 2
Dream Girl-2: ఉత్తమ నటిగా యంగ్ హీరో.. ఇంట్రెస్టింగ్గా మూవీ
టైటిలే తేడాగా ఉంది.. ఇక ట్రైలర్ చూస్తే ఇంకా ఎంత తేడాగా ఉంటుందో.. అనేలా బాలీవుడ్ నుంచి ఓ సినిమా రాబోతోంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో అయుష్మాన్ ఖురానా నటిస్తున్న డ్రీమ్ గర్ల్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. యంగ్ హీరో చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
Young hero as the best actress.. Interesting 'Dream Girl-2'
Dream Girl-2: కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో ‘ఆయుష్మాన్ ఖురానా’. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే.. ఇట్టే ఇమిడిపోతాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు లేడీ గెటప్‌లో డ్రీమ్ గర్ల్2 అనే సినిమాలో నటిస్తున్నాడు. 2019లో వచ్చిన కామెడీ డ్రామా ‘డ్రీమ్ గర్ల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుష్రత్ భారుచా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా డ్రీమ్ గర్ల్ 2 రాబోతోంది. డైరెక్టర్, హీరో మారలేదు కానీ.. హీరోయిన్గా మాత్రం లైగర్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.
బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తాకపూర్, శోభా కపూర్ సంయుక్తంగా మూవీని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆయుష్మాన్ ఖురానా లేడీ గెటప్ చూస్తే ఔరా అనాల్సిందే. మూడున్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ రేంజ్ ఫన్ ఎంటర్టైనింగ్గా ఉంది. అమ్మాయిగా అయుష్మాన్ ఖురానా చేసిన కామెడీ అదిరిపోయింది. ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉంటే.. ఇక సినిమాలో ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 25న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఆయుష్మాన్ ఖురానా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా ప్రశంసలు వస్తాయని.. ఉత్తమ నటిగా నామినేట్ అవుతానని సరదాగా చెప్పాడు. లేడీ పాత్రలో నటించడం అంత సులభం కాదని, చాలా కష్టమని తెలిపాడు. అందుకోసం చాలా వెయిట్ లాస్ అయ్యానని చెప్పాడు. ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది.