Ramya Raghupathi Not Allowed To Naresh House:City Civil Court
Naresh House: సినీ నటుడు నరేశ్‌కు (naresh) బెంగళూరులో గల సిటీ సివిల్ కోర్టులో (city civil court) ఊరట కలిగింది. అతని నివాసంలోకి మూడో భార్య రమ్య రఘుపతి (ramya) రావొద్దని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. నానక్ రామ్ గూడ ఇంట్లోకి రమ్యను రాకుండా చూడాలని అతని కుటుంబ సభ్యులు ఇదివరకు దావా వేశారు. కేసు విచారించిన కోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
నరేశ్-పవిత్ర (naresh) కలిసి నటించిన మళ్లీ పెళ్లి మూవీని నిలిపివేయాలని రమ్య రఘుపతి కోర్టులో దావా వేశారు. ఆ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మెరిట్ లేనందున.. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సెన్సార్ బోర్డు చెప్పినట్టుగా మళ్లీ పెళ్లి సినిమా కంటెంట్ కల్పితం అని పేర్కొంది. సెన్సార్ బోర్డు ఓ సినిమాను కల్పితం అని సర్టిఫై చేస్తే.. దాని విడుదలను ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు తేల్చిచెప్పింది.
నరేశ్ (naresh), అతని మూడో భార్య రమ్య రఘుపతి గత కొంతకాలం నుంచి విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో పవిత్ర లోకేశ్‌తో నరేశ్ రిలేషన్లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో నరేశ్ ఎలా సన్నిహితంగా ఉంటారని రమ్య ప్రశ్నించారు. మళ్లీ పెళ్లి సినిమాలో తనను టార్గెట్ చేశారని కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టులో ఊరట కలుగలేదు.