»Janasena Leaders Fired To Minister Ambati Rambabu
Ambati rambabu: మీరు చేస్తే నీతి..మేము చేస్తే బూతా అంబటి?
ఏదైనా సినిమా విడుదల అయితే పొలిటికల్ వివాదం కావడం కొత్తేమి కాదు. అయితే ఇటివల బ్రో సినిమాలో చిన్న విషయాలను భూతద్దంలో చూసి గొరంతను కొండంతలు చేస్తూ నానా రచ్చ చేస్తున్న అంబటి రాంబాబు ప్రవర్తన చూస్తుంటే మరి దారుణంగా ఉంది. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది హస్యం చేస్తున్నారు. అసలు ఏంది ఇతని లొల్లి అని అడుగుతున్నారు. అయితే ఇతను కావాలనే ఇలా చేస్తున్నారా? ఆ వివాదం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో ఒక పేరడి డ్యాన్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో సంక్రాంతి సందర్భంగా డ్యాన్స్‌ను కావాలనే ట్రోల్ చేశారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశంపై నానా రచ్చ చేశారు. పవన్ కల్యాణ్ సహా డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్‌తోపాటు అనేక మంది సినీ నిర్మాతలు, దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. బ్రో మూవీ నిర్మాతకు కూడా చంద్రబాబు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ క్యారెక్టర్లో కమెడియన్ పాత్రలో తర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీ నటించారు. ఇప్పటికే దీనిపై చిత్ర యూనిట్ ఆర్టిస్ట్ పృథ్వీ సహా సాయి ధరమ్ తేజ్, పలువురు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమి ఆస్కార్ నటుడు కాదని.. అతన్ని ఇమిటేట్ చేయడానికి బ్రో సినిమాలో పెట్టలేదని స్పష్టం చేశారు.
అంబటి రాంబాబు చిన్న విషయాన్ని రచ్చ రచ్చ చేసుకుని పరువు తీసుకుంటున్నాడని జనసేన నేతలు అంటున్నారు. అసలు అంబటి ప్రజా సమస్యలపై స్పందించకుండా ఇలా రాజకీయ దిగజారుడు వ్యాఖ్యలు చేసి మరింత దిగజారుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి సారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు మాత్రమే అంబటి బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇది మీరే చేస్తున్నారా లేదా సీఎం జగన్ ఇదంతా చేయిస్తున్నారా అని జనసేన నేతలు అంబటిని ప్రశ్నిస్తున్నారు.
అసలు బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు చంద్రబాబు డబ్బులు ఇచ్చినట్టు అంబటి చేసిన వ్యాఖ్యలకు ఏదైనా ఆధారాలు బయటపెట్టాలని జనసేన నేతలు అన్నారు. అంబటి చెప్పినట్లు మేము కూడా అంబటిపై సినిమా టైటిల్స్ పెట్టగలమని స్పష్టం చేశారు. సందులో సంబరాల శ్యాంబాబు@రాంబాబు..సుకన్య దగ్గరికి పోమాకు..సంజన దగ్గరికి రామాకు..అంబటి ఒక పోరంబోకు..ఇలా ఇంకా అనేకం ఉన్నాయని జనసేన నేతలు వెల్లడించారు.
గతంలో రామ్ గోపాల్ వర్మ అటు చంద్రబాబు నాయుడుని బూచీగా, దోషిగా చూపిస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం, ఇటు పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలను తీసి వారిపై నేరుగా బురద చల్లారు. ఇప్పుడు వారికి అనుకూలంగా అదే డైరెక్టర్ వ్యూహాం అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. వీటిపై మాత్రం ఏ నాయకుడు కూడా స్పందించలేదు. కానీ బ్రో సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్‌తో డ్యాన్స్ చేయిస్తే వీరికి ఎక్కడలేని చిరాకు వచ్చింది. అంటే మీరు చేస్తే నీతి.. మేము చేస్తే బూతా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.