»Chinese Woman 31 Posing For Photo Dies After Falling Into Indonesian Volcano
Volcano: ఫోటోకి ఫోజు ఇస్తూ.. అగ్ని పర్వత బిలంలోకి పడిపోయి మహిళ మృతి
పర్యాటకం కోసం అగ్నిపర్వత ముఖ ద్వారం దగ్గరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లిందో మహిళ. అక్కడ ఫోటోకి ఫోజు ఇస్తూ ప్రమాదవశాత్తూ అగ్నిపర్వత ముఖ ద్వారం లోపలికి పడిపోయి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Woman Falls In Indonesian Volcano : ఇండోనేషియా అగ్నిపర్వతం దగ్గర కనీవినీ ఎరుగని రీతిలో ఓ మహిళ మృతి చెందింది. అగ్నిపర్వత ముఖ ద్వారం నుంచి లోపలికి పడిపోయి ఆమె మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చైనాకు చెందిన హువాంగ్ లిహాంగ్ అనే 31ఏళ్ల మహిళ భర్తతో సహా ఇండోనేషియాలో పర్యటిస్తోంది. అందులో భాగంగా వారు ఇజెన్ అగ్ని పర్వతాన్ని(Ijen volcano) సందర్శించారు.
అది ఇండోనేషియాలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతం( volcano). దాని నుంచి అప్పుడప్పుడూ నీలి మంటలు, ప్రమాదకర వాయువులు(toxic gases) ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అలాంటి అగ్ని పర్వతం క్రేటర్ దగ్గరకి సూర్యాస్తమయం చూసేందుకు ఈ జంట చేరుకున్నారు. టూర్ గైడ్ కూడా వారి వెంట ఉన్నాడు. భర్తతో పాటుగా ఆమె అక్కడ ఫోటోలు దిగుతూ ఉంది. అగ్నిపర్వత ముఖ ద్వారం దగ్గరగా వెళ్ల వద్దంటూ గైడు అనేక సార్లు హెచ్చిరిస్తూ వచ్చాడు. అయినా ఆమె పట్టించుకోలేదు.
ఫోటోలు దిగుతూ ఒక్కో అడుగూ, ఒక్కో అడుగూ వెనక్కు వేస్తూ వచ్చింది. అప్పుడామె ఎలాంటి దుస్తులు ధరించి ఉందన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రమాదవశాత్తూ అగ్నిపర్వత బిలంలోకి ఆమె పడిపోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెండు గంటలపాటు ఆమెను రక్షించడానికి ప్రయత్నాలు చేశారు. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో దీన్ని యాక్సిడెంట్‌గా పోలీసులు నమోదు చేశారు. ఇండోనేషియాలో 130 వరకు యాక్టివ్ వాల్కెనోలు ఉన్నాయి. దీంతో వీటిని కూడా టూరిజంగా అక్కడి వారు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.