»American Dream To American Nightmare Migrant Crisis Hits New York
Migrant Crisis: న్యూయార్క్‌లో మరో సంక్షోభం మొదలు!
అగ్రరాజ్యం ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర వహించే అమెరికా తాజాగా ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వలసదారుల వలన డ్రీమ్ అమెరికా..కళల అమెరికాగా మారబోతున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు చుద్దాం.
American Dream To American Nightmare Migrant Crisis Hits New York
Migrant Crisis: గ్రాడ్యుయేషన్(Graduation) పూర్తి చేసుకున్న స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో సెట్ కావాలనే వారందరికీ అమెరికా(America) వెళ్లడం అనేది ఒక డ్రీమ్. ఐటీ రంగంలో రాణించాలనుకునే వారికి న్యూయార్క్ నగరం(New York City) సెకండ్ మదర్ల్యాండ్గా మారిపోయింది. కేవలం భారతదేశం నుంచే కాదు. వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికే వస్తుంటారు. ఈ కారణంగానే న్యూయార్క్ సిటీ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మంచి జీతంతో స్థిరపడొచ్చని వెళ్తున్నవారిలో గత ఏడాది దాదాపు 1,18,000 మంది వలసదారులు న్యూయార్క్‌కు వచ్చారు. అందులో కంపెనీలు ఇచ్చే అన్ని రకాల సదుపాయాలతో 60,000 మంది స్థిరనివాసల్లో ఉంటున్నారు. మిగిలిన వారు తమ సొంతంగా ఇల్లులు అద్దెకు తీసుకోవడం, హోటల్స్‌లో ఉండడం చేస్తున్నారు. ప్రతి నెల ఇక్కడికి వర్క్ మీద వస్తూనే ఉన్నారు. వీరి గృహ అవసరాలను తీర్చడానికి అక్కడి అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ హెచ్చరించారు. దీన్ని న్యూయార్క్ నగరాన్ని నాశనం చేయగల మానవతా సంక్షోభంగా పేర్కొన్నారు.
చాలా మంది వలసదారులు భద్రత, పని స్థిరత్వం కోసం పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి దక్షిణ అమెరికాకు, న్యూయార్క్‌కు వచ్చారు. వలసదారులు సాధారణంగా హోటళ్లు, కార్యాలయ భవనాలు, పాఠశాల వ్యాయామశాలల్లో ఉంటారు. వీరి గృహ అవసరాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీనికోసం మూడేళ్లలో $12 బిలియన్లు ఖర్చవుతుందని, గతంలో పార్కింగ్ స్థలాలు, క్రూయిజ్ షిప్‌లలో గృహ వలసదారులను పరిశీలించిన మేయర్ ఆడమ్స్ పేర్కొన్నారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఇద్దరూ జో బిడెన్ పరిపాలన వలస సంక్షోభానికి తగినంత మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో కొత్తగా న్యూయార్క్ సిటీకి వచ్చేవారిని హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ భారీగా గృహ సంక్షోభం ఉంది. కాబట్టి వలస వచ్చినవారికి ఇది సరైన ప్రదేశం కాదని అంటున్నారు. మరికొందరు అమెరికన్ డ్రీమ్ ఒక పీడకళగా మారుతుందని భావిస్తున్నారు. అంతే కాదు ఇళ్లతో పాటు వలస కూలీలు పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. వారు అధికారికంగా పని చేయడం ప్రారంభించే ముందు, వారు తప్పనిసరిగా వర్క్ పర్మిట్ పొందాలి. అది ప్రాసెస్ చేయడానికి ఆరు నెలల వరకు పట్టవచ్చు. పర్మిట్ లేకుండా చేస్తే తక్కువ జీతం తీసుకోవాల్సి వస్తుంది. దీంతో వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నగర ప్రముఖులు అంటున్నారు.