మతమార్పిడీలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇతర మతంలోకి మారితే SC హోదా రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా మరే మతంలోకి మారినా ఎస్సీ హోదా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ అయిన వ్యక్తి SC&ST చట్టం కింద రక్షణ పొందలేరని, ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. మతం మార్చుకున్న వెంటనే SC హోదాను రద్దు చేస్తామంది.