Chia Seeds Benefits : చియాసీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అసలే ఎండలు దంచి కొడుతున్న ఈ కాలంలో వీటిని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువ వేడి చేసింది అనుకున్నప్పుడు చియా గింజలు(Chia Seeds) వేసిన నీటిని తాగడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా వీటి వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.
మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో బరువు తగ్గడం చాలా తేలిక. అందుకనే వెయిట్ లాస్ జర్నీని మొదలు పెట్టాలనుకునే వారు సమ్మర్లో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలాంటప్పుడు మీ ఆహారంలో భాగంగా నానబెట్టిన చియా సీడ్స్‌ని(Chia Seeds) తీసుకోండి. శరీరంలోని మలినాల్ని ఇవి చక్కగా బయటకు గెంటేస్తాయి. డిటాక్సిఫికేషన్ చేసి బరువు తగ్గడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు వేసిన నీటిని తాగడం వల్ల తొందరగా ఆకలి, దాహం వేయవు. కాబట్టి మీ వెయిట్ లాస్ జర్నీ వీటితో మరింత తేలికగా మారుతుంది.
కొలస్ట్రాల్ ఇబ్బందులు ఉన్న వారు చియా సీడ్స్(Chia Seeds) తినడం మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలా పీచు పదార్థమూ ఎక్కువ ఉంటుంది. అందువల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇక ఈ గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన ఎముకలు దృఢంగా మారతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని నిరభ్యంతరంగా తినొచ్చు. మనలో చక్కెర స్థాయిల్ని అదుపు చేయడానికి ఇవి సహకరిస్తాయి. అయితే వీటిని రోజుకు రెండు మూడు స్పూన్ల కంటే ఎక్కువ తినకూడదని గుర్తుంచుకోవాలి. అలా ఎక్కువ తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి.