»Police Patrolling In Rolls Royce Miami Police Makes It Happen
patrolling : అక్కడ రోల్స్ రాయస్ కారులో పోలీస్ పెట్రోలింగ్! ప్రపంచంలోనే మొదటిసారి
ప్రభుత్వ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడటం మనం చూసుంటాం. అయితే ఓ బీచ్ పోలీసులు ప్రపంచంలోనే మొదటి సారి లగ్జూరియస్ రోల్స్ రాయస్ కారులో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడంటే..?
Police patrolling in Rolls Royce: మనం ఎప్పుడో ఒకసారి రోడ్డు మీద లగ్జరీ కారు కనిపిస్తే కళ్లప్పగించి చూస్తూ ఉంటాం. అలాంటిది ఓ దగ్గర విలాసవంతమైన రోల్స్ రాయస్ కారులో పోలీసులు పెట్రోలింగ్(Police patrolling) చేస్తున్నారు. దీంతో ‘ఛ అక్కడ పోలీసు ఉద్యోగం దొరికినా బాగుండును’ అని కొంత మంది యువకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇంతకీ అంత లగ్జూరియస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడిదో తెలుసుకుందాం రండి మరి.
అమెరికాలోని మియామీ బీచ్ పోలీసులు(Miami Beach Police) పెట్రోలింగ్ కోసం ఇలా రోల్స్ రాయస్(Rolls Royce) కారు వేసుకుని పెట్రోలింగ్ చేస్తూ చక్కర్లు కొడుతున్నారు. ప్రపంచంలోనే మొదటి సారి లగ్జరీ కారులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్గా రికార్డులకెక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పోలీసు డిపార్ట్మెంట్ తమ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త, ఫోటోలు నెట్లో వైరల్‌గా మారాయి.
ఈ పోలీస్ పెట్రోలింగ్‌కి సంబంధించిన వీడియోలనూ మియామీ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది. సూర్యాస్తమయ సమయంలో జిగేల్ మంటున్న రోల్స్ రాయస్ రాజసాన్ని రకరకాల యాంగిల్స్‌లో బంధించి వీడియోని చిత్రీకరించారు. మరింకెందుకు ఆలస్యం ఆ వీడియోని మీరూ చూసేయండి.
MBPD and professional staff exemplify the highest standards of dedication and quality policing in our unparalleled commitment to the residents and visitors we serve. We are thrilled to introduce this stunning addition to the MBPD recruitment team—courtesy of @bramanmotors ! pic.twitter.com/I27NUAgsge