ATP: జిల్లా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 72 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష ఏపీసీ టీ.శైలజ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మహిళా అభ్యర్థులు జనవరి 12 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. టైప్-3, టైప్-4 విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.