Silver Straps: కాళ్లకు పట్టీలు ధరించడంతో కలిగే ప్రయోజనాలు ఇవే..?
కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు దరిచేరవని మన పూర్వీకులు చెబుతున్నారు. శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యిందని వివరిస్తున్నారు.
Silver Straps: పూర్వీకులు ఏం చేసినా ఆలోచించే చేశారు. అదీ ఆహారపు అలవాట్లు, పని, ఆహార్యం.. ఏ విషయంలో అయినా సరే.. వారు చేసింది కరెక్ట్.. తర్వాత పరిశోధనల్లో కూడా తేలాయి. విషయానికి వస్తే.. అమ్మాయిలు కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పట్టీలు (Silver Straps) పెట్టుకునేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
1.వెండి పట్టీలు ధరిస్తే శరీరంలో ఏదైనా తేడా జరిగితే ఇట్టే తెలిసిపోతుంది. పట్టీలు రంగు మారతాయి.
2.మహిళలకు ఎక్కువగా చెమటలు వచ్చినా, అనారోగ్యంగా ఉన్నా.. శరీరంలో సల్పర్ పరిమాణం పెరిగి పట్టీలు నల్లగా మారతాయి.
3.పట్టీలు ఉన్న చోట చర్మం నీలం రంగులోకి మారితే శరీరంలో సోడియం స్థాయి పెరిగిందని చెబుతున్నారు. దీంతో ఉప్ప తీసుకోవడం తగ్గిస్తే సరిపోతుంది.
4.ఎక్కువసేపు నిలబడి పనిచేసే మహిళల్లో కాళ్ల నొప్పుల నివారణకు పట్టీలు సాయపడతాయి. పట్టీలు కాళ్లకు ఆక్యుప్రెషర్ లాంటి వైద్యం ఇస్తాయి.
5.వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అందుకే చాలా మంది వెండి గ్లాసులు, వెండి స్పూన్లు, ప్లేట్స్ వాడుతుంటారు. ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వల్ల ఎముకలు మరింత ధృడంగా మారతాయి.
6.ఇన్ఫెక్షన్లతో వెండి పోరాడుతోంది. జలుబు, దగ్గు, వైరస్, బ్యాక్టీరియా దాడుల నుంచి కాపాడుతుంది.
7.రుమటాయిడ్ అర్థరైటిస్తో బాధపడే మహిళలకు పట్టీలు అద్భుత ఫలితాలు ఇస్తాయి. చికిత్సలో సిల్వర్ మెక్రో ఫార్టికల్స్ ఉపయోగిస్తారు. వెండి కీళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తోంది.
8.పట్టీలు ధరిస్తే హార్మోన్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయట. గర్భసంచి సమస్యలు కూడా తొలగిపోతాయట. యాంగ్జైటీ, మానసిక సమస్యలు దూరం చేయడంలో సాయపడతాయట.
9.వెండి చంద్రుడు, శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర చెబుతోంది.
10.వెండి చలువ చేసే లోహం.. మడమ పైన ధరించడం వల్ల భూమి నుంచి శక్తి శరీరంలోకి ప్రవహిస్తోంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తోంది.
11.కాళ్ల పట్టీల శబ్ధం గుడిలో గంటనుండి వెలువడే శబ్దంతో సారూప్యం కలిగి ఉంటుంది. ఇదీ శరీరానికి వైబ్రేషన్ అందిస్తోంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఇస్తోంది.