పార్టీ పేరుతో మొదలయ్యే మద్యపానం ఏడాదికోసారి, నెలకోసారి, వారానికోసారి కొనసాగుతూ చివరకు రోజుకో రెండుసార్లు వచ్చి ఆగుతుంది. మద్యపానం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ మద్యపానం మానేయడం అంత సులభం కాదు. సమయానికి మద్యం అందకపోతే మద్యపాన ప్రియులు అశాంతికి గురవుతారు. మానసికంగా కలత చెందుతారు. దాదాపు మద్యం వల్ల చావు తప్పదని తెలిసినా చివరి క్షణం వరకు మద్యం సేవించేవారు కూడా ఉన్నారు. అయితే మద్య వ్యసనం చాలా కష...
ఉపవాసం అనేది మనకు కొత్త కాన్సెప్ట్ కాదు. ఇది చాలా కాలంగా విభిన్న సంస్కృతులలో భాగం. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మన ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. సైన్స్ కూడా దీనికి మద్దతు ఇస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది చేయాలని చెబుతుండగా..మరికొంత మంది మాత్రం వద్దని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకు కారణమైన బ్యాక్టీరియా గురించి కచ్చితంగా కొన్ని విషయాలను అందరూ తెలుసుకోవాలి.
ఈ మధ్య కాలంలో చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. ఒకప్పుడు నూటికో, కూటికో వచ్చే ఈ క్యాన్సర్ ఇప్పుడు చాలా మందిలో కామన్ గా మారిపోయింది. అయితే ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే చాలు అని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి ఇప్పుడు చూద్దాం.
రెగ్యులర్‌గా చేయించుకునే రిపోర్టుల్లో నార్మల్‌గానే ఉన్నాయని.. తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వివరించారు. సుష్మిత నటించిన ఆర్య-3 వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
చిన్నారులు ఎక్కువగా క్షయ వ్యాధి బారిన పడుతుంటారు. దీనిని నిర్ధారణ చేయాలంటే పిల్లల నుంచి కఫం శాంపిల్స్ సేకరించాలి. ఇది చాలా కష్టం. ఈక్రమంలో జర్మనీ పరిశోధకులు రక్తపరీక్షతో క్షయ వ్యాధిని నిర్ధారించారు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసు. అయినా కూడా చాలా మంది దానిని వదలలేరు. ధూమపానం చేయడమే కాదు. ధూమపానం చేయడానికి ఎంచుకున్న రోజు సమయం కూడా ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ధూమపానం చేయడం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్కిజోఫ్రెనియా ఒక మానసిక రుగ్మత. దీనితో బాధపడుతున్న వ్యక్తి సామాజిక, వృత్తిపరమైన రంగాలలో రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రుగ్మత చాలా అరుదుగా కనిపిస్తుంది.
చాలా మందికి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు ఒకటి. ఇది వివిధ రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని పోషకాల గురించి చెప్పాలంటే ఫైబర్, మెగ్నీషియం, ప్రొటీన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. జీడిపప్పు అందరూ తినే ఉంటారు. కానీ జీడిపప్పు పాలు తాగారా? ఇది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం.
యాపిల్ గింజలను నిర్లక్ష్యంగా తింటున్నారా.. యాపిల్ గింజల్లో విషం ఉందని ఎక్కడైనా విన్నారా? ఆపిల్ విత్తనాలు నిజానికి విషపూరితమైనవి. కానీ అవి పొడిగా చేసి ఉండి..ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనిషిని చంపేస్తాయి.
ప్రపంచంలో తొలిసారిగా పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌లో భారత వైద్య పరిశోధక మండలి విజయవంతం చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుందని భారత వైద్య మండలి నిర్ధారించింది.
ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీ మాత్రమే కాదు.. మనం తినే, తాగే, బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా చాలా మారిపోయాయి. ఇంతకుముందు బెల్ బాటమ్ ప్యాంట్స్ ట్రెండ్ అయితే.. ఆ తర్వాత టైట్ జీన్స్ జనాల లైఫ్ స్టైల్ లో చోటు సంపాదించుకుంది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు.
వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. దీంతో రెండు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వైద్యులు సర్జరీ చేసి కుర్రాడికి పునర్జన్మ పోశారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇలా రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి నవరాత్రి పండుగ ప్రారంభం కానుంది. ఒకవైపు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు, పూజల్లో భక్తులు మునిగితేలుతుండగా, మరోవైపు వివిధ ప్రాంతాల్లో దాండియా కోలాటం వాయించనున్నారు.
డయాబెటిక్ రోగులు వారి రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలని నిపుణులు సూచించారు. అలాంటి ఆహారాన్ని కంటిన్యూగా తీసుకోవడం చాలా కష్టమైన పని. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇటీవల మధుమేహంపై ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది.