మానసిక ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సాధారణ అంశం. అయితే దీనిని పలు రకాల పండ్ల ద్వారా అధిగమించవచ్చని నిపుణలు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఒత్తిడి, హార్మోన్ల మార్పులు ప్రతి ఒక్కరి జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో మన మూడ్ స్వింగ్‌లను పలు రకాల పండ్లను స్వీకరించడం ద్వారా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కమలాపండు
కమల పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి మాత్రమే కాదు.. సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల సంశ్లేషణలో కూడా పాత్ర పోషిస్తుంది. మీ డైట్లో కమల పండు చేర్చుకుంటే మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మిమ్మల్ని ఇది ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
పైనాపిల్
పైనాపిల్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీ మూడ్ బాలేనప్పుడు, హ్యాపీగా కూర్చుని పైనాపిల్ ముక్కలు తినేయండి మరి.
నిమ్మకాయ
నిమ్మ పోషకాల పవర్‌హౌస్. నిమ్మలోని విటమిన్లు, వాటర్ కంటెంట్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ ఒక వ్యక్తిని పునరుజ్జీవింపజేస్తుంది. మీ మనస్సు సరిగ్గాలేనప్పుడు, నిమ్మరసం నీళ్లలో కొద్దిగా పుదీనా వేసి తీసుకోండి.
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్ టేస్ట్లోనే కాదు, పోషకాల్లోనూ సూపర్ అనొచ్చు. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగితే, మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బెర్రీలలోని విటమిన్ సి డోపమైన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. డోపమైన్ హ్యాపీ హార్మోన్. ఇది మానసిక ఉల్లాసాన్ని ప్రేరేపిస్తుంది.
అరటిపండు
అరటిపండు అన్ని కాలాల్లోనీ ఈజీగా దొరికే పండు. ఇది మానసిక స్థితిని కూడా మెరుగుపరిచే గొప్ప పండు. అరటిపండులో అధికంగా ఉండే విటమిన్ B6 మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరోటోనిన్‌ను ఏర్పరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.