»Cracked Heels Causes And Prevention Winter Skin Care And Health Tips
Health Tips : మీ మడమలు పగులుతున్నాయా.. అయితే మీకు ఆ జబ్బు ఉన్నట్లే ?
పగిలిన మడమలు సాధారణ సమస్యగా పరిగణిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కోసం ప్రజలు ఖరీదైన మాయిశ్చరైజర్లను వాడుతుంటారు.
Health Tips : పగిలిన మడమలు సాధారణ సమస్యగా పరిగణిస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కోసం ప్రజలు ఖరీదైన మాయిశ్చరైజర్లను వాడుతుంటారు. దాంతో పాటు హోం రెమెడీలను కూడా పాటిస్తుంటారు. ఇవన్నీ వాడినా మడమల పగుళ్ల సమస్య నుండి ఉపశమనం లభించకపోతే దానిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మడమల పగుళ్లు కారణానికి తీవ్రమైన వ్యాధి లేకపోయినా, కొన్ని పోషకాల లోపం కూడా పగుళ్లు సమస్యను కలిగిస్తుంది. చలి గాలులు రావడంతో చర్మం తేమను కోల్పోవడం మొదలవుతుంది. దీనితో మడమల పగుళ్ల సమస్య చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పగిలిన మడమలను కొన్ని హోం రెమెడీలతో నయం చేయవచ్చు, కానీ సమస్య కొనసాగితే దాని వెనుక గల కారణం ఏమిటో తెలుసుకుందాం.
మడమల పగుళ్లకు సాధారణ కారణాలు
శరీరంలో నీరు లేకపోవడంతో చర్మం పొడిబారి మడమలు పగుళ్లు ఏర్పడతాయి. అంతే కాకుండా ఎక్కువసేపు చల్లని నేలపై చెప్పులు లేకుండా నడవడం లేదా చల్లటి నీటిలో నిరంతరం పనిచేయడం వల్ల కూడా మడమల పగుళ్ల సమస్య వస్తుంది. జాగ్రత్త తీసుకోకపోతే గాయాలు కూడా ఏర్పడవచ్చు, ఇది చాలా బాధాకరంగా ఉంటుంది.
ఈ పోషకాల లోపం ఉండవచ్చు
కొన్నిసార్లు మడమల పగుళ్లకు పోషకాల కొరత కూడా కారణం కావచ్చు, ఎందుకంటే శరీరానికి సరైన పోషకాహారం అందకపోతే దాని ప్రభావం మీ ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపై కూడా కనిపిస్తుంది. శరీరంలో విటమిన్ సి, బి3, విటమిన్ ఇ, కాల్షియం, ప్రోటీన్ల లోపం వల్ల కూడా మడమల పగుళ్ల సమస్య వస్తుంది. ఈ సమస్య కొనసాగితే నిపుణుడిని ఆశ్రయించాల్సి ఉంటుంది.
పాదాల పరిశుభ్రత
చాలా మంది వ్యక్తులు తమ ముఖం, చేతుల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ పాదాలను విస్మరిస్తారు. ముఖ చర్మాన్ని ఏవిధంగానైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో… పాదాల పట్ల శ్రద్ధ వహించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన పాదాలు ముఖం కంటే దుమ్ము, మట్టి, బ్యాక్టీరియాతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటాయి.
మధుమేహం కూడా ప్రభావం చూపుతుంది
మధుమేహం లక్షణాలలో ఒకటి స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా చర్మం గట్టిపడటం, దీని కారణంగా చర్మం ఆకృతి మారడం ప్రారంభమవుతుంది. అధిక బ్లడ్ షుగర్ కారణంగా, గాయాలు కూడా త్వరగా నయం కాదు. అందువల్ల మీ పగిలిన మడమలు నయం కాకపోతే మీరు మీ రక్తంలో చక్కెరను ఒకసారి పరీక్షించుకోవాలి.