తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం ఓట్ల లెక్కింపుతో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టనున్నారో తేలిపోనుంది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పోలీసులకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Police : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం ఓట్ల లెక్కింపుతో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టనున్నారో తేలిపోనుంది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పోలీసులకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జిల్లాల సీపీలు, ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా ఉంచాలని సూచించారు. చివరి రౌండ్లో ఉత్కంఠ జరిగే అవకాశం ఉన్నందున ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులను కోరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుమిగూడకుండా అదనపు బలగాలను సిద్ధంగా ఉంచాలన్నారు. గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతీకార దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరు గెలిచినా అభ్యర్థులు సమన్వయంతో సహకరించాలి. రెండు రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని సీపీ, ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.