చలికాలంలో కఫం సమస్య ఎక్కువగా ఉంటుంది.
అల్లం టీ తాగితే కఫం సాధ్యమైనంత వరకూ తగ్గుతుంది.
ఉదయాన్నే 1 లేదా 2 రెబ్బల వెల్లుల్లి తిని నీళ్లు తాగడం వల్ల కఫం తగ్గుతుంది.
పైనాపిల్ తినడం వల్ల కూడా కఫం తగ్గుతుంది.
పుదీనా ఆకుల్ని నీళ్లలో మరిగించి తాగితే కఫం సమస్య రాదు.
రోజూ 2 లేదా 3 స్పూన్ల తేనెను గోరువెచ్చటి నీటిలో తీసుకుంటే కఫం రాదు.