»Eating This Food With Fish Can Be Toxic To Health
Food: చేపలతో కలిపి ఈ ఆహారం తీసుకోవద్దు..చాలా ప్రమాదం..!
మీరు మాంసాహారులైతే కచ్చితంగా చేపలను తినడానికి ఇష్టపడతారు. చేప ఒక పోషకాహారం. ఇందులో లీన్ ప్రొటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు తినడం వల్ల మెదడు మెరుగ్గా పనిచేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే చేపలతో కలిపి కొన్ని పదార్థాలను తినకూడదు.
చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని ఆహారాలతో కూడిన చేపలను తినడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. జీర్ణసంబంధమైన వ్యాధులు వస్తాయి. ఈ ఆహారాలను చేపలతో మాత్రమే తినకపోవడం మంచిది.
పాల ఉత్పత్తులు:చేపలతో పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, చర్మ ఇన్ఫెక్షన్లు , అలర్జీలు వస్తాయి. పాల పదార్థాలు, చేపల కలయికతో ఆహారాలు తీసుకుంటే అధిక ప్రోటీన్ కంటెంట్ శరీరంలోకి చేరుతుంది. అది జీర్ణక్రియను బలహీనపరుస్తుంది.
సిట్రస్ పండ్లు: చేపలు , సిట్రస్ పండ్ల కలయిక ప్రమాదకరం. సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి. చేపలలో అవి కలిపి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బీన్స్-చిక్కుళ్ళు: బీన్స్, చిక్కుళ్ళు వల్ల పొట్టలో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. బీన్స్‌లో రాఫినోస్ అని పిలువబడే కాంప్లెక్స్ చక్కెరలు అధికంగా ఉంటాయి. బీన్స్‌లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుంది. అందులోకి చేపలు కలిపితే కడుపు ఉబ్బరం మొదలవుతుంది.
పిండి పదార్ధాలు: బంగాళాదుంపలు లేదా పాస్తా వంటి భారీ లేదా పిండి పదార్ధాలతో చేపలను కలపడం తగ్గించండి. ఎందుకంటే అందులో ఉండే అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరాన్ని ఓవర్‌లోడ్ చేస్తాయి. జీర్ణవ్యవస్థకు ఇబ్బందిని కలిగిస్తాయి.
స్పైసీ ఫుడ్ : చేపలను స్పైసీ ఫుడ్ తో కలిపి తింటే చేపల రుచి తగ్గుతుంది. అలాగే చేపలతో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
ప్రాసెస్ చేయబడిన, వేయించిన ఆహారం: చేపలను ఎక్కువగా ప్రాసెస్ చేసినా లేదా వేయించిన ఆహారాలతో తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వేయించిన ఆహారాలలో అధిక స్థాయి సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.