Health Tips: చలికాలంలో వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
భారతీయ వంటల్లో ఎక్కువ ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి.. వెల్లుల్లి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మీకుతెలిసే ఉంటుంది. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం రెట్టింపుగా ఉంటాయట. మరి, ఆ ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సాయపడతాయి. అల్లిసిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో ఫ్రీ రాడికల్స్ నుండి శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడి ఇమ్యూనిటీని పెంచుతాయి. చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో చిన్నపిల్లలే కాకుండా పెద్దలు కూడా బాధపడుతుంటారు. అలాంటి వారు రెగ్యులర్గా వెల్లుల్లిని తినాలి. వెల్లుల్లిని పచ్చళ్ళు, కూరల్లో కలపి తింటే ఇమ్యూనిటీ పెరిగి జలుబు దూరమవుతుంది.
వెల్లుల్లిలో వేడి పుట్టించే గుణాలు ఉన్నాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతని పెంచి చలిని తగ్గిస్తుంది. వెల్లులి తీసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది చేతులు, కాళ్ళకి వెచ్చదనాన్ని అందించి జలుబు నుండి ఉపశమనం అందుతుంది. చలికాలంలో వెల్లుల్లి రసం తీసుకుంటే వ్యాధులని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చలికాలంలో గుండెపోటు, ఇతర సమస్యలు దూరమవుతాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెరుగుతుంది. కాబట్టి, చలికాలంలో వెల్లుల్లి తినడం మంచిది.