»Health Tips Not Only Grapes Its Leaves Are Also Beneficial
Grapes : ద్రాక్ష పండ్లే కాదు… ఆకులు కూడా ఆరోగ్యమే…!
Grapes ఎండాకాలం వచ్చింది అంటే చాలు మనలో చాలా మంది ద్రాక్ష పండ్లు తినడానికి ఇష్టపడతారు. ద్రాక్ష పండ్లు అందరూ తింటారు. కానీ ద్రాక్ష ఆకులు ఎప్పుడైనా తిన్నారా..? నమ్మసక్యం కాకపోయినా.. ద్రాక్ష ఆకులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ద్రాక్షలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల కంటే దాని ఆకులకు ఎక్కువ గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ద్రాక్ష ఆకులను గ్రీకు, టర్కిష్, వియత్నామీస్ మరియు రోమేనియన్ వంటకాలలో ఉపయోగిస్తారు.
ఎండాకాలం వచ్చింది అంటే చాలు మనలో చాలా మంది ద్రాక్ష పండ్లు తినడానికి ఇష్టపడతారు. ద్రాక్ష పండ్లు అందరూ తింటారు. కానీ ద్రాక్ష ఆకులు ఎప్పుడైనా తిన్నారా..? నమ్మసక్యం కాకపోయినా.. ద్రాక్ష ఆకులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ద్రాక్షలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల కంటే దాని ఆకులకు ఎక్కువ గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ద్రాక్ష ఆకులను గ్రీకు, టర్కిష్, వియత్నామీస్ మరియు రోమేనియన్ వంటకాలలో ఉపయోగిస్తారు. అయినప్పటికీ, భారతదేశంలో వాటి ఉపయోగం చాలా అరుదుగా కనిపిస్తుంది.
ద్రాక్ష ఆకులను ఆకుపచ్చ ఆకు కూరలుగా పరిగణిస్తారు. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి ఈ ఆకులు పోషకాలతో నిండి ఉంటాయి. కాబట్టి ద్రాక్ష ఆకులు మనకు ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఫైబర్
ద్రాక్ష ఆకులలో గణనీయమైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది, కాబట్టి చక్కెర నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెరను పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.
విటమిన్-ఎ
ద్రాక్ష ఆకులు శరీరంలో విటమిన్ల పరిమాణాన్ని పెంచుతాయి. ఇందులో విటమిన్-ఎ మంచి మోతాదులో ఉంటుంది. విటమిన్-ఎ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. మీ ఎముకలు, చర్మం, జీర్ణవ్యవస్థ మరియు దృష్టి వ్యవస్థ అన్నీ పనిచేయడానికి విటమిన్-ఎపై ఆధారపడి ఉంటాయి.
విటమిన్-కె
విటమిన్-కె రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ శరీరంలో విటమిన్ల స్థాయి బాగా ఉంటే, అది గాయపడినప్పుడు రక్తం గడ్డలను సృష్టిస్తుంది, కాబట్టి ఈ గడ్డకట్టడం సహాయంతో, రక్తస్రావం ఆగిపోతుంది.
కాల్షియం
ద్రాక్ష ఆకులు కాల్షియ, ఐరన్ అనే రెండు ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి శరీరానికి కాల్షియం అవసరం, కాబట్టి మీ ఆహారంలో కాల్షియం చేర్చుకోవడం మర్చిపోవద్దు.
ఐరన్…
ద్రాక్ష ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ అనేది శరీరంలో రక్త నష్టాన్ని నిరోధించే ఖనిజం. ఇది రక్తహీనత నుండి మిమ్మల్ని నివారిస్తుంది. అలాగే, ఈ ఖనిజం మీ రక్తం శరీరం చుట్టూ ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
ద్రాక్షపండు లేదా దాని రసం కంటే ద్రాక్ష ఆకులలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. కాబట్టి ఈరోజు నుండి ద్రాక్ష ఆకులను ఉపయోగించడం ప్రారంభించండి.