చలికాలంలో శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గుల వలన జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు సులభంగా అటాక్ అవుతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుకోవచ్చు.
నల్లమిరియాలు వంటల రుచిని పెంచడమే కాకుండా శరీరంలో రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. దీని వలన శరీరం చురుగ్గా ఉంటుంది. ఎర్ర మిరపకాయలలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. దాల్చిన చెక్క రక్తనాళాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
అల్లం వేడిగుణం కలిగి ఉంటుంది. చలికాలంలో వంటలలో అల్లాన్ని బాగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. తాపజనక లక్షణాల కారణంగా అల్లం చలి నుండి ఉపశనం కలిగిస్తుంది. ఏలకులు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. సువాసన కారణంగా ఏలకులను అమితంగా ఇష్టపడతారు. శరీరంలో ఉష్టోగ్రతను బ్యాలెన్స్ ఉంచుతాయి. లవంగాలు పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. దీనిని వంటల్లో ఉపయోగించవచ్చు. ఏలకుల లానే రోజు ఒక లవంగాన్ని మెల్లిగా నమిలి తినవచ్చు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది.
వెల్లుల్లి రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. వంటకాల రుచి పెంచడంలోనూ, శరీర ఉష్ట్రోగ్రత బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పదార్థాలను వాటిని వంటలలో వాడడం ద్వారా లేదా టీ లో కలుపుకొని తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవచ్చు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.