»Fitness Influencer Comment Do You Eat Chole Bhature Like That Reaction To Netizens
Chole Bhature: చోలే భటోరాని అలా తింటారా..నెటిజన్ కు రియాక్షన్స్!
చోలే భటోరా(Chole Bhature) బ్రేక్ ఫాస్ట్ అనేక మందికి ఇష్టమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. అయితే ఇటివల ఓ వ్యక్తి దీనిని అధిక సాల్టెడ్, నో ప్రోటీన్ ఫుడ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. అది చూసిన ఈ ఫుడ్ లవర్స్ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా తెలపండి మరి.
Do you eat Chole Bhature like that Reaction to netizens
దేశంలోని కొన్ని ప్రాంతాలలో చోలే భటోరా(Chole Bhature) అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార కలయికలలో ఒకటి. ఇది స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌తో పాటు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో వడ్డిస్తూ ఉంటారు. ఈ రుచికరమైన వంటను అందరూ ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించవచ్చు. కానీ చాలా మంది ముఖ్యంగా అల్పాహారం కోసం దీన్ని ఇష్టపడతారు. ఇటీవల ఓ వ్యక్తి తనకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ అంటూ సోషల్ మీడియాలో దీనిని షేర్ చేశారు.
I will never understand how can people eat this tala bhuna highly salted no protein meal first thing in the morning https://t.co/Qx0gmTysO4
అయితే దానిపై ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన కామెంట్ నెట్టింట చర్చగా మారింది. అసలు దీనిని ఎవరైనా బ్రేక్ ఫాస్ట్ లో తింటారా కొంచెం కూడా ప్రోటీన్ లేదు. మొత్తం ఉప్పుతో నిండి ఉంది అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చాలా మందికి ఎంతో ఇష్టమైన ఈ ఆహారాన్ని ఆయన అలా అనడం నెటిజన్లకు నచ్చలేదు. ఆయన చేసిన కామెంట్(comment) పై విరుచుకుపడుతున్నారు.
కాగా ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు దానికి 625.6K వ్యూస్ వచ్చాయి. కాగా, అతను చేసిన కామెంట్ మాత్రం కరెక్ట్ కాదని పలువురు చెబుతున్నారు. అది అతని ఛాయిస్ అని, దాంట్లో తప్పేమీ లేదు కదా అని చాలా మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే చోలే బటోరాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని, ఆ విషయం తెలీదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.