never combine these foods with tea : మనలో చాలా మంది మధ్యహ్నం పూట రీఫ్రెషమెంట్ కోసం టీని(tea) కచ్చితంగా తాగుతుంటాం. అది తాగితే కాస్త ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే చాలా మంది టీతో పాటు కాంబినేషన్‌గా బిస్కెట్లు, సమోసాలు, పకోడీలు, బజ్జీలు లాంటి ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. మరి టీతో పాటుగా అస్సలు తినకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే…
ఆకుపచ్చగా ఉండే కూరగాయల్లో సహజంగా ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఎప్పుడూ కూడా టీతో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే నట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావాలు ఉంటాయి. టీలో ఉండే టానిన్ అనే సమ్మేళనం గింజలతో తీసుకున్నప్పుడు పోషకాల శోషణను అడ్డుకుంటుంది. అలాగే చాలా మంది టీతోపాటు పకోడీలు, బజ్జీలు లాంటి శెనగపిండితో చేసిన పదార్థాలను తింటుంటారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
టీ తాగిన వెంటనే పెరుగు, పెరుగుతో తయారు చేసిన వంటలుగాని తినకూడదు. టీ(tea) మనకు వేడి చేస్తే.. పెరుగు చలువ చేస్తుంది. అందువల్ల జీవ క్రియ అస్తవ్యస్థం అవుతుంది. అలాగే పసుపును టీతో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఈ రెండు పదార్థాల్లో ఉండే రసాయనాలు చర్య జరపడం వల్ల జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది. చాలా మందికి లెమన్ టీ అంటే చాలా ఇష్టం. కానీ టీ పొడికి, నిమ్మకాయ రసాన్ని కలిపి తీసుకుంటే అది ఆమ్లంగా మారుతుంది. అందువల్ల కడుపు ఉబ్బరం వచ్చి చికాకు పెడుతుంది. దీని వల్ల గుండెల్లో మంటగా ఉన్నట్లూ ఉంటుంది. లెమన్ టీనే కాదు, టీ తాగిన తర్వాత నిమ్మకాయ నీళ్లను తాగడమూ నిషిద్ధం.