»Diets High In Added Sugar Linked To Kidney Stones Study
kidney stones : పంచదార ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లొస్తాయా!
కిడ్నీల్లో రాళ్లు అనేవి ప్రస్తుత కాలంలో సర్వ సాధారణ సమస్యలా చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కువగా పంచదార ఉన్న పదార్థాలను తినడం వల్ల ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Added Sugar Linked to Kidney Stones : బరువు ఎక్కువగా ఉండటం, సరిగ్గా నీళ్లు తాగకపోవడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం, అస్సలు శారీరక వ్యాయామాల జోలికి వెళ్లకపోవడం లాంటి కారణాల వల్ల కిడ్నీల్లో ఏర్పడతాయని అందరికీ తెలుసు. అయితే ఆహారంలో చక్కెరను(Sugar) ఎక్కువగా తీసుకోవడం వల్లా ఇవి వస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
యూకే నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ వారు ఓ సర్వే నిర్వహించారు. దాదాపుగా పదకొండేళ్లపాటు ఈ సర్వే జరిగింది. ఆ కాలంలో 28,303 మంది పెద్దల నుంచి ఆరోగ్య చరిత్ర, వారి ఆహారపు అలవాట్లను విశ్లేషించారు. వీరిలో కిడ్నీ రాళ్ల(Kidney Stones) సమస్యలతో బాధ పడే వారు రోజూ ఎక్కువగా ఏఏ ఆహారాలను తింటున్నారు అనేది చూశారు.
దాంట్లో వీరు ఎక్కువ మోతాదులో ఉప్పుతో పాటు చక్కెర కలిగి ఉన్న ఆహారం, శీతల పానీయాల్లాంటి వాటిని తాగుతూ ఉన్నట్లు గుర్తించారు. వారు తినే చిరు తిళ్లు ఏమిటో వాటిని తయారు చేసే క్రమంలో వాటిలో వాటిలో వాడిన స్వీటనర్లు, పంచదార ఏ స్థాయిలో వినియోగించారో అంచనా వేశారు. ఇలాంటి యాడెడ్ షుగర్స్ తీసుకునే వారిలో మూత్రపిండాల్లో ఎక్కువగా రాళ్లు ఏర్పడటాన్ని గుర్తించారు. ఈ పంచదార నుంచి వచ్చే అత్యధిక క్యాలరీలకూ రాళ్లతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. యాడెడ్ షుగర్స్(Added Sugar) వల్ల 25 శాతం కంటే ఎక్కువగా శక్తిని పొందిన వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటి వల్ల ఐదు శాతం కంటే తక్కువ శక్తిని పొందే వారితో పోలిస్తే 25శాతం పైన పొందే వారిలో 88 శాతం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.