Is it true that eating tomatoes can cause kidney stones?
tomatoes: ఈమధ్యకాలంలో టమాటా ధర ఆకాశాన్నంటింది. టమాటా కొనేందుకు జనం భయపడిపోయారు. టమాటా ధర పెరగడంతో నిమ్మ కాయను ప్రత్యామ్నాయంగా వినియోగించినవారు కూడా ఉన్నారు. మళ్లీ ఈ మధ్యే కాస్త తగ్గింది. నిజం చెప్పాలంటే భారతీయ వంటగది టమోటాలు లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది.
టొమాటోలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే టొమాటోలు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలామంది అంటున్నారు. ఇది నిజామా?
టొమాటో ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ టొమాటోలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని చాలామంది నమ్ముతున్నారు. అందుకే చాలా మంది ఈ భయంతో టమోటాలు తినరు. అయితే టమోటాలు నిజంగా కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
టమోటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయన్న వాదనలో వాస్తవం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టొమాటో తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిసిందే. కానీ ఇప్పటికే కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు అదనంగా టమోటా తింటే కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
టొమాటోలో ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లను కలిగిస్తుంది. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే, టమోటాలలోని ఆక్సలేట్ మళ్లీ రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు టమోటాలు ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు. కానీ టమోటాలు పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు.
టమోటా తినడం ఆరోగ్యానికి హానికరం కాదు. ఎసిడిటీ ఉన్నవారు టమోటాలు తింటే గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఎసిడిటీ ఉన్నవారు టమాటా తీసుకోవడం తగ్గించాలి.చాలా మందికి టమోటాలు అంటే ఎలర్జీ. కానీ ఇది చాలా అరుదు. అలాంటి వారు టొమాటో తినకుండా ఉండాలి.