HNK: జిల్లా కేంద్రంలోని పాత మున్సిపాలిటీ గ్రౌండ్లో శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి టిబెటియన్ ఉలెన్ స్వెటర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ మార్కెట్ శీతాకాలంలో నాణ్యమైన ఉలెన్ దుస్తులతో నగరంలో ఆకర్షణగా నిలుస్తుందని ఆయన అన్నారు. టిబెటియన్ వ్యాపారులు దశాబ్దాలుగా వరంగల్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.