Kidney StoneS : కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణాలు అనేకం. మూత్ర పిండాల్లో స్ఫటికాల్లా ఏర్పాడి నొప్పిని కలిగిస్తుంటాయి. వేసవి కాలంలో ఈ నొప్పి మరింత వేదిస్తూ ఉంటుంది. అందుకనే వేసవి కాలాన్ని ‘కిడ్నీ స్టోన్ సీజన్’ అనీ పిలుస్తూ ఉంటారు. మరి ఈ కాలంలో కిడ్నీల్లో రాళ్ల(Kidney Stones) వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్ల సమస్యను తగ్గించుకోవడానికి ముందు మనం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అందుకు నీరు, కొబ్బరి బొండం నీళ్లు… లాంటి ద్రవాల్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా ఒక మనిషి రోజూ రెండు లీటర్ల నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే అందరి శరీర అవసరాలు ఒకేలా ఉండవు. యూరిన్ రంగును బట్టి ఎంత నీరు తాగాలనే దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. యూరిన్ ఎక్కువ ముదురు రంగులో గనుక వస్తూ ఉంటే అందులో ఖనిజాల్లాంటివి ఎక్కువగా ఉంటున్నాయని అర్థం చేసుకోవాలి. మరిన్ని నీటిని తాగేందుకు ప్రయత్నించాలి. అప్పుడే రాళ్ల(Stones) సమస్య రాకుండా ఉంటుంది.
మనకు ఈ కాలంలో మాత్రమే దొరికే మామిడి పండ్లను తినే ప్రయత్నం చేయాలి. గ్లాసు మామిడి పండ్ల రసంలో అరగ్లాసు క్యారెట్ రసాన్ని కలుపుకుని కనీసం రెండు నెలల పాటు తాగాలి. అప్పుడు కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరిగిపోయి క్రమంగా బయటకు వచ్చేస్తాయి. ఇది వేసవి కాలంలో మాత్రమే పాటించదగ్గ చిట్కా. మిగిలిన కాలాల్లో మామిడి పండ్లు మనకు అందుబాటులో ఉండవు కాబట్టి ఈ కాలంలో ప్రయత్నించవచ్చు. ఇలా చేయడం వల్ల రాళ్లు దూరం కావడమే కాదు. విటమిన్ ఏ అధికంగా అంది రేచీకటి పోతుంది. కంటి చూపు మెరుగవుతుంది. కళ్ల మంట, దురదల్లాంటివి రాకుండా ఉంటాయి. కాల్షియం ఎక్కువగా ఉండే బ్లాక్‌బెర్రీ, ద్రాక్ష, కివీ లాంటి పండ్లను సైతం బాగా తినాలి.