అధిక రక్తపోటు, ఒత్తిడి అనేవి అతిపెద్ద ఆరోగ్య సమస్యలుగా పరిణమించాయి. అయితే, వాటిని నియంత్రించడానికి రెండు రకాల పండ్లు తినాలి. అవేంటంటే, అవకాడో, అరటి.. వాటిలో పొటాషియం, బి6 విటమిన్, ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటాయి. అవి సెరొటొనిన్ రసాయనాన్ని విడుదల చేసి మెదడును స్థిమితపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.