Mahesh babuకి ఏమైంది…? జర్మనీలో డాక్టర్‌ను ఎందుకు కలిశారు, ఫ్యాన్స్ ఆందోళన
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనారోగ్యంపై అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఆయన వైద్యుడు హ్యారీతో కలిసి ఫోటో దిగి, పోస్ట్ చేయడంతో టెన్షన్‌కు గురవుతున్నారు.
Mahesh babu:సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) అనారోగ్యానికి గురయ్యారా..? అందుకే ఆయన ఫారిన్ వెళ్లారా..? జర్మనీలో వైద్యుడిని (doctors) ఎందుకు కలిశారు..? ఈ ప్రశ్నలు ఆయన ఫ్యాన్స్ మెదడును తొలిచివేస్తున్నాయి. తాజాగా ఇన్ స్టలో మహేశ్ బాబు (Mahesh babu) పోస్ట్ చేయడంతో.. ఆయనకు ఏం జరిగిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మహేశ్ బాబు (Mahesh babu) సోషల్ మీడియాలో చాలా తక్కువ పోస్ట్స్ చేస్తుంటారు. జర్మన్ డాక్టర్ హ్యారీ కోనిక్తో కలిసి ఉన్న ఫోటోను పెట్టారు. తన ఆరోగ్యంపై శ్రద్ద చూపినందుకు థాంక్స్ అంటూ కామెంట్ చేశారు. దీంతో అభిమానులు (fans) తెగ టెన్షన్ పెడుతున్నారు. ఇంతకీ ఏమైంది..? మహేశ్ బాబును (Mahesh babu) డాక్టర్‌ను ఎందుకు కలిశారు అని కామెంట్స్ చేస్తున్నారు. అతని అనారోగ్యానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు.
డాక్టర్ హ్యారీ ఫేమస్ నాచురోపతి వైద్యుడు. బ్రెన్నర్ మెడికల్ కేర్ సెంటర్లో హెడ్‌గా కొనసాగుతున్నారు. మహేశ్ బాబు (Mahesh babu) 28వ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే (pooja hegde) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన తర్వాత.. జక్కన్న రాజమౌళితో (raja mouli) మహేశ్ (Mahesh babu) పాన్ వరల్డ్ మూవీ ఉండనుంది.
జర్మనీ బ్రెన్నర్ పార్క్ హోటల్లో మహేశ్ (Mahesh babu) ఫ్యామిలీ స్టే చేస్తోంది. భార్య నమ్రత, కూతురు సితారా, కుమారుడు గౌతమ్‌తో కలిసి హాలీడే ట్రిప్‌లో ఉన్నారు. వైద్యుడిని కలువడం.. ఫోటో షేర్ చేయడంతో ఏం జరిగిందో అనే ఆందోళన నెలకొంది.