KMM: ముదిగొండ మండలం గోకినపల్లి సమీపంలో పంట చేలలో విద్యుత్ మోటార్ల వద్ద వైర్లు కత్తిరించి రాగి వైర్‌ను అపహరించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రైతులు శనివారం గుర్తించారు. వారిని వెంబడించి పట్టుకునే ప్రయత్నంలో వెంకటాపురం సమీపంలో ఒక వ్యక్తి దొరకగా, మరో వ్యక్తి పారిపోయాడు. దొరికిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు రైతులు తెలిపారు.