Puri,Charmi : అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ పాటికి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యేది. కానీ లైగర్ సినిమాతో సీన్ మొత్తంగా రివర్స్ అయిపోయింది. లైగర్ దెబ్బకు ఈ డాషింగ్ డైరెక్టర్ లైమ్ లైట్లో లేకుండా పోయాడు. భారీ ఆశలు పెట్టుకొని లైగర్ కోసం దాదాపుగా మూడేళ్లు కష్ట పడ్డాడు.. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫలితం తేడా కొట్టేసింది.
అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ పాటికి పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యేది. కానీ లైగర్ సినిమాతో సీన్ మొత్తంగా రివర్స్ అయిపోయింది. లైగర్ దెబ్బకు ఈ డాషింగ్ డైరెక్టర్ లైమ్ లైట్లో లేకుండా పోయాడు. భారీ ఆశలు పెట్టుకొని లైగర్ కోసం దాదాపుగా మూడేళ్లు కష్ట పడ్డాడు.. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫలితం తేడా కొట్టేసింది. అంతేకాదు ఈడీ, సెటిల్మెంట్స్ వ్యవహారంతో పూరి చాలా డిస్టర్బ్ అయ్యాడు. దాంతో పూరి బయట కనిపించడమే మానేశాడు. అప్పుడప్పుడు పూరి మ్యూజింగ్స్ ద్వారా పవర్ ఫుల్ వాయిస్ మాత్రమే వినిపిస్తున్నాడు. దాంతో ప్రస్తుతం పూరి ఏం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు.. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కాడు పూరి. అది కూడా తన హాట్ టాపిక్ చార్మితో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్లో దర్శనమిచ్చాడు. అంతేకాదు ఇద్దరు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పూరి నవ్వుతూ కనిపించడం చూస్తుంటే.. నెక్స్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ చేసినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్, బాలయ్య కోసం స్టోరీస్ రాస్తున్నాడనే టాక్ ఉంది. అలాగే రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూరి మొహంలో చిరునవ్వు చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. త్వరలోనే పూరి తన పెన్ పవర్ చూపించబోతున్నాడని అంటున్నారు. మరి పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందో చూడాలి.