NTR : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎప్పుడైతే అమెరికా ఫ్లైట్ ఎక్కాడో.. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అంతా.. ఒక్కసారిగా సోషల్ మీడియా పై పడిపోయారు. ఇక అమెరికాలో చరణ్ క్రేజ్ చూస్తే.. ఔరా అనాల్సిందే. అక్కడ టీవి షోలు, టాక్ షోలు, ఇంటర్య్వూలు, ప్రముఖ అవార్డ్స్ ప్రజెంటర్‌గా దుమ్ముదులిపేస్తున్నాడు చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎప్పుడైతే అమెరికా ఫ్లైట్ ఎక్కాడో.. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అంతా.. ఒక్కసారిగా సోషల్ మీడియా పై పడిపోయారు. ఇక అమెరికాలో చరణ్ క్రేజ్ చూస్తే.. ఔరా అనాల్సిందే. అక్కడ టీవి షోలు, టాక్ షోలు, ఇంటర్య్వూలు, ప్రముఖ అవార్డ్స్ ప్రజెంటర్‌గా దుమ్ముదులిపేస్తున్నాడు చరణ్. దాంతో గ్లోబల్ స్టార్ అని.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు మెగాభిమానులు. ఇక అమెరికా మీడియా అయితే.. చరణ్‌ను హాలీవుడ్ హీరోలతో పోలుస్తోంది. చరణ్ గురించి గొప్పగా చెప్పడమే కాదు.. ఏకంగా అక్కడ ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’గా పరిచయం చేశారు. దాంతో చరణ్ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడంతో.. మార్చి 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికాకి వెళ్లాడు చరణ్. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేకపోయాడు. తారకరత్న మరణించడంతో.. అన్ని పనులు వాయిదా వేసుకున్నాడు. ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ పిలిచినా వెళ్లలేదు. అయితే ఇప్పుడు తారక రత్న కోసం ఎన్టీఆర్ చేయాల్సిన పనులన్నీ దాదాపుగా పూర్తైపోయినట్టే. పెద్ద కర్మ కూడా అయిపోయింది. దాంతో అమెరికా ఫ్లైట్ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 6న అమెరికాకు వెళుతున్నాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ యూనిట్‌తో కలిసి ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌కు అటెండ్ కానున్నాడు. ఈ సమయం కోసమే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. జస్ట్ ఎన్టీఆర్.. ఇంటి నుంచి స్టార్ట్ అవడమే లేట్.. మెగా ఫ్యాన్స్‌కు ధీటుగా ఎన్టీఆర్ ప్రతీ మూమెంట్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి రెడీ అంటున్నారు. ఇప్పటికే #ManOfMassesNTR.. #NTRGoesGlobal అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అలాంటిది.. తారక్ అమెరికాలో ల్యాండ్ అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరి ఎన్టీఆర్, చరణ్ కలిసి అమెరికాలో ఎలా రచ్చ చేస్తారో చూడాలి.