Yamini Singh Casting couch: ఆ హీరోయిన్ను రాత్రి ఒంటరిగా రమ్మన్న హీరో..షాకింగ్ కామెంట్స్ చేసిన నటి
కాస్టింగ్ కౌచ్(Casting couch) ఉద్యమం అప్పట్లో చెలరేగింది. ఆ తర్వాత దాని గురించి మాట్లాడ్డం మానేశారు. చాలా మంది 90 శాతం వరకూ పబ్లిసిటీ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకున్నారు. దానివల్ల నిజంగా బాధింపబడిన మహిళలు కాస్టింగ్ కౌచ్(Casting couch) గురించి చెప్పడంలేదు. అయితే ఇప్పటికి కూడా ఎక్కడో ఇక చోట ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ సంఘటనల గురించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఓ హీరోయిన్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ప్రముఖ సింగర్, హీరో పవన్ సింగ్(Pawan Singh)పై భోజ్పురి హీరోయిన్ యామిని(Yamini singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సింగ్ తో ఈ నటి గతంలో నటించారు. అయితే ఆ తర్వాత ఈ హీరోయిన్ నటించడం తగ్గించారు. మంచి పాత్రలు లేకపోవడం వల్ల సినిమాలను అవాయిడ్ చేస్తున్నట్లు యాక్టర్ యామిని(Yamini) అప్పట్లో చెప్పారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ స్టార్ హీరో పవన్ సింగ్(Pawan Singh)పై సంచలన ఆరోపణలు చేశారు. తాను కాస్టింగ్ కౌచ్ (Casting couch)ను ఫేస్ చేసినట్లు తెలిపారు. పవన్ సింగ్ ను మొదట్లో మంచి మనిషి అనుకున్నానని, అయితే అతని బుద్ది ఆ తర్వాత తెలిసిందన్నారు. ఓ రోజు రాత్రి 9 గంటలకు కాల్ చేసి ఓ స్టూడియోకు తనను ఒంటరిగా రమ్మన్నాడని అడిగినట్లు యామిని(Yamini) తెలిపింది. తాను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం యామిని సింగ్(Yamini Singh) చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. యామిని సింగ్(Yamini singh)కు అవకాశాలు ఇప్పించింది పవన్ సింగ్(Pawan singh) అని భోజ్ పురి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు యామిని చేసిన ఆరోపణలకు పలువురు షాక్ అవుతున్నారు.