Hamsa Nandini: క్యాన్సర్ బాధితులకు అండగా హంసానందిని
క్యాన్సర్(Cancer) మహమ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు వదిలారు. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ చాలా మందిని ఈ క్యాన్సర్ మహమ్మారి వేధించింది. అలాంటి వారిలో హీరోయిన్ హంసా నందిని(Hamsa Nandini) కూడా ఒకరు. టాలీవుడ్(Tollywood)లో ''అనుమానాస్పదం'' అనే సినిమాతో హంసా నందిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. గ్లామరస్ ఐటెమ్ సాంగ్స్ లోనూ ఆమె నటించి అందర్నీ ఆకట్టుకుంది.
క్యాన్సర్(Cancer) మహమ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు వదిలారు. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ చాలా మందిని ఈ క్యాన్సర్ మహమ్మారి వేధించింది. అలాంటి వారిలో హీరోయిన్ హంసా నందిని(Hamsa Nandini) కూడా ఒకరు. టాలీవుడ్(Tollywood)లో ”అనుమానాస్పదం” అనే సినిమాతో హంసా నందిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. గ్లామరస్ ఐటెమ్ సాంగ్స్ లోనూ ఆమె నటించి అందర్నీ ఆకట్టుకుంది.
హంసా నందిని(Hamsa Nandini) నటిగా వరుసగా ప్రాజెక్టులు చేస్తూ ఉండే సమయంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దీంతో సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏడాది కాలం పాటు ఆమె క్యాన్సర్ (Cancer)తో పోరాడింది. ఆ మహమ్మారిని జయించింది. క్యాన్సర్ ను జయించే క్రమంలో ఆమె ఎంతో నరకయాతన అనుభవించింది. క్యాన్సర్(Cancer) తన తల్లి నుంచి జన్యుపరంగా వచ్చిందని తెలియడంతో షాక్ అయ్యింది. దీంతో మరికొంత కాలం ఆమె చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
మహిళా దినోత్సవం(Womens Day) సందర్భంగా క్యాన్సర్(Cancer)తో హంసా నందిని(Hamsa Nandini) చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంది. హంసా నందిని తల్లి కూడా గతంలో క్యాన్సర్ తో బాధపడింది. క్యాన్సర్(Cancer)ను జయించిన సందర్భంగా హంసా నందిని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తనలాగే క్యాన్సర్(Cancer)తో బాధపడేవారికి ఆమె అండగా నిలబడింది. వ్యాధి తీవ్రతకు బయపడకుండా చిరునవ్వుతో పోరాడింది. రొమ్ము క్యాన్సర్ బారిన పడి మరణించిన తన తల్లి పేరు మీద ‘యామినీ క్యాన్సర్ ఫౌండేషన్’ను నెలకొల్పనున్నట్లు హంసా నందిని(Hamsa Nandini) తెలిపింది. తనలాగ, తన తల్లిలాగే బాధపడుతున్న చాలా మందికి అండగా నిలబడేందుకు ఫౌండేషన్ ను స్థాపించనున్నట్లు తెలిపింది.