నేటితో 'సూర్యవంశం'! సినిమాకి పాతికేళ్లు .వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. తండ్రీకొడుకులుగా వెంకటేశ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రాధిక, మీనా ఆయన సరసన నటించారు.1998 ఫిబ్రవరి 25న విడుదలైన ‘సూర్యవంశం’ ఆ యేడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలచింది.
తెలుగునాట రీమేక్స్ తో కింగ్ లా సాగారు హీరో వెంకటేశ్. తమిళంలో విజయవంతమైన ‘సూర్యవంశం’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. తండ్రీకొడుకులుగా వెంకటేశ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రాధిక, మీనా ఆయన సరసన నటించారు.
సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. 1998 ఫిబ్రవరి 25న విడుదలైన ‘సూర్యవంశం’ ఆ యేడాది సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలచింది.
‘సూర్యవంశం’ కథ ఏమిటంటే – తన ఊరిలో మకుటం లేని మహారాజు హరిశ్చంద్ర ప్రసాద్. ఆయనకు ముగ్గురు కొడుకులు ఓ కూతురు. అందరినీ బాగా చూసుకొనే హరిశ్చంద్ర ప్రసాద్ కు చిన్న కొడుకు భానుప్రసాద్ అంటే అఇష్టం. అందుకు ఒకప్పుడు తాను చెప్పిన అమ్మాయిని భానుప్రసాద్ పెళ్ళాడలేడన్నదే కారణం
బాగా చదువుకొని సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తనను ప్రేమించడమేమిటని భానుప్రసాద్ కంగు తింటాడు. చివరకు ఆమె అతడిని ఒప్పిస్తుంది.వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. తత్ఫలితంగా రెండువైపుల వారు వారిని దూరం పెడతారు. స్వశక్తితో భానుప్రసాద్ అంచెలంచెలుగా ఎదుగుతాడు.
అతనికి ఓ కొడుకు పుడతాడు. భార్య కలెక్టర్ అవుతుంది. తన పేరున ట్రావెలింగ్ సర్వీస్ పెట్టిన చిన్న కొడుకు అంటే హరిశ్చంద్రప్రసాద్ కు కూడా అభిమానం కలుగుతుంది. తన మనవడిని చూసుకొని మురిసిపోతాడు హరిశ్చంద్ర ప్రసాద్. తొలి నుంచీ హరిశ్చంద్ర ప్రసాద్ అంటే గిట్టని సింగరాజు, పాయసంలో విషం కలుపుతాడు.
అది తాగిన హరిశ్చంద్రప్రసాద్ ఆసుపత్రి పాలవుతాడు. తండ్రి అంటే గిట్టని భానుప్రసాద్ విషం కలిపిన పాయసం తన కొడుకుతో పంపించాడని సింగరాజు ప్రచారం చేస్తాడు. చివరకు హరిశ్చంద్రప్రసాద్ వచ్చి నిజం చెప్పి, సింగరాజును చితగ్గొడతాడు. మనస్పర్థలు తొలగి చిన్నకొడుకు కుటుంబంతో సహా అందరినీ కలుపుకొని హరిశ్చంద్రప్రసాద్ ఆనందించడంతో కథ సుఖాంతమవుతుంది.