MDK: నిజాంపేట మండల కేంద్రంతో పాటు నార్లపుర్ గ్రామంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవానికి రంగం సిద్ధమైంది. మే నెల సెలవులు తోడవడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాలు, రంగుహంగులతో దేవాలయాలను కనువిందుగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ముస్తాబైన ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు.