పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు విడుదల చేసిన బ్రో మూవీ టైటిల్, పోస్టర్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ క్యామియోలో నటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 28 జూలై 2023న విడుదల కానుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. కాగా, ఈ మూవీ ఓకే చేసే సమయంలో పవన్ తనకు ఎలా సర్ ప్రైజ్ ఇచ్చాడో సాయి ధరమ్ తేజ్ చెప్పడం విశేషం. ఒక రోజు పవన్ కళ్యాణ్ తనను పిలిచి ఇంటికి రమ్మని పిలిచాడని పేర్కొన్నాడు. తానే సినిమాలో లీడ్ యాక్టర్ అని, అందులో నన్ను నడిపించే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నానని చెప్పినప్పుడు నేను తడబడ్డాను. మామయ్య తనతో జోక్ చేస్తున్నాడు అని అనుకున్నానని తేజ్ చెప్పారు.
ఆ క్రమంలో మొన్న దర్శకుడు సముద్రఖని నాకు మూడు పేజీల డైలాగ్ ఇచ్చి రేపు ఈ సీన్ వస్తుందని చెప్పాడు. మరుసటి రోజు నేను బాగా ప్రిపేర్ అయ్యాను. కానీ డైరెక్టర్ చివరి మూడు లైన్లు చాలు అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని మొదటి లైన్లు వదిలేసి చివరి మూడు లైన్లు బాగా ప్రిపేర్ అయ్యాను. సెట్‌కి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారని, నేను చివరి మూడు లైన్లు చెప్పబోతుంటే, పవన్ కళ్యాణ్ డైలాగ్ మొత్తం చెప్పండి అని షాకిచ్చారు. మొత్తం డైలాగ్ చెప్పమని చెప్పినప్పుడు, నాకు సరిగ్గా గుర్తుకు రాలేదన్నారు. డైలాగ్ పేపర్ తీసుకురావాలని కో-డైరెక్టర్ని అడిగాను. డైలాగ్ మొత్తం ప్రిపేర్ అయ్యాను. నేను షాట్‌కు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. సన్నివేశం ప్రారంభం కాగానే, పవన్ కళ్యాణ్, “మొత్తం డైలాగ్ అవసరం లేదు. చివరి మూడు లైన్లు చెప్పావా?” అంటూ నాకు మరోసారి షాకిచ్చారని వెల్లడించారు. పవన్ తనను ఇలా రెండు సార్లు ఏడిపించాడని గుర్తు చేసుకున్నారు.