ఈ వారం మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’, ’18 పేజెస్’ రిలీజ్ అవగా.. ముందు రోజు తమిళ్ నుంచి నయనతార ‘కనెక్ట్’, విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. మిగతా సినిమాలను కాసేపు పక్కన పెడితే.. విశాల్‌కు మాత్రం లాఠీ సినిమా ఎంతో కీలకంగా మారింది. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ మాస్ హీరోగా తెలుగు, తమిళ్లో మెప్పించాడు విశాల్. పందెం కోడితో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విశాల్.. ఆ తర్వాత పొగరు, భరణి, భయ్యా లాంటివి కమర్షియల్ సినిమాలతో దూసుకెళ్లాడు. కానీ గత కొంత కాలంగా రేసులో వెనకబడిపోయాడు ఈ పందెం కోడి. విశాల్ నుంచి వచ్చిన హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే.. అది 2018లో వచ్చిన అభిమన్యుడు మాత్రమే అని చెప్పొచ్చు. అప్పటి నుంచి సక్సెస్ అనేది విశాల్‌కు దూరంగా వెళ్లిపోయింది. కానీ మనోడు మాత్రం సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తునే ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘లాఠీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశాడు విశాల్. షూటింగ్లో గాయాల పాలయ్యాడు. దాంతో ఖచ్చితంగా లాఠీ హిట్ అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు లాఠీ దెబ్బ చూపించేలా ఉందంటున్నారు. ఇక ఓపెనింగ్స్ అయితే మరీ దారుణం అంటున్నారు. ఇప్పటి వరకు విశాల్ నటించిన ఏ సినిమాకు చూడనంత తక్కువగా లాఠీ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆక్యుపెన్సీ 20శాతం కూడా దాటలేదట. అడ్వాన్స్ బుకింగ్స్ 10శాతం కూడా కాలెదట. అంతేకాదు.. దాదాపు చాలా థియేటర్లలో లాఠీ మార్నింగ్ షోలు రద్దయ్యాయట. దాంతో ఇక విశాల్ పనైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అప్ కమింగ్ సినిమాలతోనైనా విశాల్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.