ఇప్పటి వరకు బాలయ్య సినిమాల రికార్డులన్నింటిని.. బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు వీరసింహారెడ్డి. అఖండ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య.. ఈసారి మరిన్ని రికార్డులు తిరగరాయడం పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టే ఓవర్సీస్లో దుమ్ముదులుపుతోంది వీరసింహారెడ్డి. ఈ సినిమా తెలుగులో థియేటర్లో రావడానికి ముందే.. ఓవర్సీస్లో ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఈ సినిమాకు యుఎస్‌లో భారీ క్రేజ్ ఏర్పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్డ్ ప్రీమియర్స్ కోసం ఈ మూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది. 287 లొకేషన్లలో ప్రీమియర్స్ కోసం.. అడ్వాన్స్ బుకింగ్ పరంగా 525K డాలర్లని రాబట్టినట్టుగా చెబుతోంది అక్కడి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ. మొత్తంగా వీరసింహారెడ్డి అడ్వాన్స్ ప్రీ సేల్స్ హాఫ్ మిలియన్ మార్క్‌ని దాటిందని అంటున్నారు. బాలయ్య సినిమాల్లో ఇది ఓ రికార్డుగా చెబుతున్నారు. . అయితే మెగాస్టార్ నటిస్తున్న వాల్తేరు వీరయ్య మాత్రం.. ఓవర్సీస్ రేసులో కాస్త వెనకబడిపోయాడు. 274 లొకేషన్లలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ.. అడ్వాన్స్ ప్రీ సేల్స్ 400K డాలర్స్ రాబట్టిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ వార్ ఇలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. మెగా ఫ్యాన్స్‌కు కంటే.. ఓ రోజు ముందుగానే నందమూరి ఫ్యాన్స్ హల్చల్ చేయనున్నారు. ఆ నెక్స్ట్ డే.. అంటే జనవరి 12న వాల్తేరు వీరయ్య రచ్చ మొదలు కానుంది. మరి వీరసంహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఇద్దరిలో ఎవరు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారో చూడాలి.