»Upasana Showing Charity Once Again Latest Earnings Donation For Women Trust Dfvdf
Upasana: మరోసారి దాతృత్వం..మహిళల కోసం సంపాదన విరాళం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య Upasana గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని హౌస్ ఆఫ్ టాటా యొక్క జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో స్టోర్ ప్రారంభించినందుకు గాను ఉపాసన(Upasana) అందుకున్న మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ (DFVDT), దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
ఉపాసన.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపాసన(Upasana) ప్రస్తుతం అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తూనే మరో వైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఉపాసన తన సంపాదనను మహిళల కోసం విరాళంగా ఇస్తూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని హౌస్ ఆఫ్ టాటా నుంచి జోయా(zoya) కొత్త స్టోర్‌ను ఉపాసన ప్రారంభించారు. ఇంతలో ఆ స్టోర్ ఓపెన్ చేసినందుకు యజమాని ఇచ్చిన రెమ్యూనరేషన్ విరాళంగా అందజేశారు. ఉపాసన ఆ మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్(DFVDT), దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అణగారిన వర్గాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ట్రస్ట్ కట్టుబడి ఉందని ఉపాసన తెలిపారు.
జూబ్లీహిల్స్(jubilee hills)లోని హౌస్ ఆఫ్ టాటా నుంచి జోయా స్టోర్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఉపాసన అన్నారు. జోయాలో లభించే ఆభరణాలు విలాసవంతమైన ఆభరణాలకు కేరాఫ్ అడ్రస్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి తనను అతిథిగా ఆహ్వానించినందుకు జోయాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నామని ఉపాసన ఈ మేరకు గుర్తు చేశారు. ఉపాసన సహకారం ముఖ్యమైన కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో ఆమె ఎంతో నిబద్ధతను చూపుతుంది. అంతేకాదు ఉపాసన గతంలో సైతం అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.