»Teja Role Superhero In Hanuman Movie Director Prasanth Varma
Prasanth Varma: ‘హనుమాన్’లో తేజ సూపర్ హీరో: డైరెక్టర్
‘హనుమాన్’ మూవీలో హీరో తేజది సూపర్ హీరో రోల్ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. తన నెక్ట్స్ మూవీకి అధీరకు హనుమాన్ మూవీతో కనెక్షన్ ఉంటుందని వివరించారు.
Teja Role Superhero in Hanuman Movie Director Prasanth Varma
Prasanth Varma:‘హనుమాన్’ ( Hanuman) సైన్స్ ఫిక్షన్ మూవీ వచ్చేనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో తేజ సజ్జ హీరోగా.. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. నిరంజన్ రెడ్డి మూవీని నిర్మించగా.. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించారు. ఇదీ ఆయన నాలుగో సినిమా.. ‘అ’, ‘కల్కీ’, ‘జాంబిరెడ్డి’ తర్వాత చేస్తోన్న మూవీ హనుమాన్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో డైరెక్టర్ ప్రశాంత్ (Prasanth)బిజీగా ఉన్నారు.
సూపర్ హీరో మూవీ చేయాలనే ఆలోచన వచ్చిందని ప్రశాంత్ (Prasanth) చెప్పారు. తనకు సూపర్ హీరోలంటే ఇష్టం అని.. చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీ చూసి అలా అవ్వాలని సాలెపురుగు పట్టుకునే తిరిగేవాడినని గుర్తుచేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో సూపర్ హీరో కమర్షియల్ జోన్.. తెలుగులో ఎందుకు ట్రై చేయొద్దని భావించి ‘హనుమాన్’ మూవీ తీశానని వివరించారు. సూపర్ హీరో సినిమాలో హీరో తేజ (Teja) చెడును అంతం చేస్తాడు. ఆ తర్వాత అతను పోషించిన పాత్ర ఏం చేయనుందనే ఆసక్తి ఉంటుంది. మూవీ పూర్తయ్యాక ఏం చేస్తాడనే అంశం ఇంట్రెస్టింగ్ అనిపిస్తోందని చెప్పారు. అందుకోసమే తన నెక్ట్స్ మూవీ ‘అధీర’కి హనుమాన్ మూవీకి కనెక్షన్ ఇచ్చామని వివరించారు.
హనుమాన్ (Hanuman) మూవీకి సంబంధించి జక్కన్న రాజమౌళి (Rajmouli) సలహాలు ఇచ్చారని ప్రశాంత్ వర్మ గుర్తుచేశారు. దాంతో తమకు సమయం కలిసి వచ్చిందని వివవరించారు. హనుమాన్ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత విదేశీ భాషల్లో విడుదల చేస్తామని చెప్పారు. రాజమౌళి (Rajmouli) చెప్పడంతో ఇలా చేస్తున్నామని.. దీంతో ప్రమోషన్స్‌కి సమయం ఉంటుందని వివరించారు.