పుష్ప సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. అయితే ప్రస్తుతం అమ్మడికి సౌత్ ఇండస్ట్రీ కంటే.. హిందీ పైనే మోజు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. మొదటి సినిమా ‘గుడ్ బై’ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘మిషన్ మజ్ను’ పై భారీ ఆశలు పెట్టుకుంది. కాకపోతే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తారని అనుకుంటే.. డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రష్మికకు హిందీ సినిమాలు షాక్ ఇస్తునే ఉన్నాయి. మిషన్ మజ్ను మూవీ జనవరి 20 వ తేదీ నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం రష్మిక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ క్రిటిక్ రష్మికను ఏకంగా తరిమి కొడతామంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ క్రిటిక్నంటూ చెప్పుకునే కేఆర్కే.. రష్మికపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు.. విజయ్ దేవరకొండ ప్రస్థావన తీసుకొచ్చి మరీ.. రష్మిక పై సంచలన ట్వీట్ చేశాడు. మేడమ్ రష్మిక జీ.. నీ బాయ్ ఫ్రెండ్ అనకొండ చిత్రం లైగర్‌తో.. హిందీ ఆడియెన్స్ అతన్ని బాలీవుడ్ నుండి తరిమికొట్టారు. ఇప్పుడు అతని లాగే నీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. కానీ భోజ్‌పురి చిత్రాలలో మిమ్మల్ని చూడటం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది.. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విజయ్, రష్మిక ఫ్యాన్స్ మండి పడుతున్నారు. దారుణాతి దారుణంగా అతన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మిక బాలీవుడ్లో రానిస్తుందేమో చూడాలి.