NTR : షాకింగ్.. ప్రశాంత్ నీల్ కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నాడా!?
NTR : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మార్చిలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్‌తో జాయిన్ అవబోతున్నాడు తారక్. ప్రజెంట్ సలార్ మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 పై ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్. వీలైతే ఈ ఇయర్ ఎండింగ్‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా మరోసారి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఎన్టీఆర్ 31 రెండు భాగాలుగా రాబోతోందా.. అనే సందేహాలు కూడా వస్తున్నాయి. లేదంటే కొత్త సబ్జెక్ట్‌తో వస్తారా.. అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఎన్టీఆర్ 31 తర్వాత ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. అంతేకాదు.. ఏకంగా ప్రశాంత్ నీల్ కోసం మూడేళ్ళ సమయాన్ని కేటాయించబోతున్నాడట ఎన్టీఆర్. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవడానికి నాలుగేళ్ళు పడుతుందని అంటున్నారు. మామూలుగా అయితే.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు ఏండ్లకేండ్లు సమయాన్ని కేటాయించాలి. కానీ ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అంత టైం తీసుకుంటాడా.. అనే డౌట్ రాక మానదు. కానీ కెజియఫ్ లెక్కన చూస్తే.. తప్పదంటున్నారు. కెజియఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2కి మూడేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. అలాగే సలార్‌కు కూడా రెండేళ్లకు పైగానే తీసుకుంటున్నాడు. కాబట్టి ఎన్టీఆర్ సినిమా కోసం చాలా సమయం పడుతుందని చెప్పొచ్చు