Sharwanand : మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ కుర్ర హీరో. గతేడాది వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత చేసిన 'ఒక ఒక జీవితం' సినిమాతో మాత్రం శర్వానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు.
మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ కుర్ర హీరో. గతేడాది వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత చేసిన ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మాత్రం శర్వానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కానీ వసూళ్ల పరంగా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఇటీవలె రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతున్నాడు. ఇక శర్వానంద్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అయ్యింది. దాంతో తాజాగా.. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి థాంక్స్ చెప్తూ శర్వానంద్ ఎమోషనల్ లెటర్ రిలీజ్ చేశాడు. అలాగే మార్చి 6న తన్ బర్త్ డే సందర్భంగా.. కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా.. శర్వా కెరీర్లో 35వ సినిమా కానుంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో ట్రెండీ స్టైలిష్ లుక్‌లో అదరిపోయేలా ఉన్నాడు శర్వానంద్. ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫాక్టరీ బ్యానర్ పై రూపొందనుంది. ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తుండగా.. విష్ణు శర్మ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీకి సంబందించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. మరి ఈ మూవీతో శర్వానంద్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.