బాలీవుడ్లో నెపొటిజం పై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తునే ఉన్నాయి. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు దారుణమైన పరిస్థితికి పడిపోవడానికి ఇది కూడా ఓ కారణం. ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్ల వారసులే బాలీవుడ్‌ను ఏలుతున్నారు. అందుకే ఏ సినిమా వచ్చినా బాయ్ కాట్ చేస్తున్నారు బాలీవుడ్‌లోని ఓ వర్గం వారు. దానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ముడిపెడుతూ.. బాలీవుడ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. లైగర్ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండే విషయంలోను.. బాయ్ కాట్ బ్యాచ్ విరుచుకు పడింది.. అంటే అక్కడ నెపొటిజం పై ఎంత అసహనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా సుశాంత్ సింగ్ మృతిపై పోస్ట్ మార్టమ్ స్టాఫ్ సంచలన వ్యాఖ్యలు చేయడం.. మున్ముందు బాలీవుడ్‌కు దారుణ పరిస్థితి పడేసినట్టేనని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే రెండేళ్ల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందడం.. అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అతనిది ఆత్మహత్య అని పోలీసులు తెల్చినా.. ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. ఇప్పటికీ సుశాంత్ మరణం మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో.. తరచుగా సుశాంత్ హఠాణ్మరణంపై పలు సంచలన కథనాలు వినిపిస్తూనే వున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అందించిన రూప్ కుమార్ షా కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాడీతో పాటే.. మొత్తం ఐదు మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించాం.. అందులో ఒకటి సుశాంత్ బాడీ అని తెలిసింది. అతని దేహంపై కొట్టినట్టు అనేక గుర్తులున్నాయి.. మెడపై గాయాలున్నాయి. దాంతో వెంటనే ఇది సూసైడ్ కాదు.. మర్డర్ అని పై ఆఫీసర్లకు తెలియజేశాం.. కానీ సీనియర్స్ మాత్రం పోలీసులు చెప్పినట్టుగా చేయమన్నారని చెప్పాడు. అయితే రెండేళ్ల తర్వాత రూప్ కుమార్ షా ఎందుకు స్పందించాడనే విషయం అర్థం కానిదే.. కానీ మరోసారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మర్డర్ మిస్టరీ వైరల్‌గా మారింది.