ఇటీవలె యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది స్టార్ హీరోయిన్ సమంత. అయితే మయోసైటిస్ కారణంగా.. యశోద కోసం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది సామ్. ఎమోషనల్ కూడా అయింది. అయితే అప్పటి నుంచి మళ్లీ కెమెరా ముందుకు రాలేదు సామ్. దాంతో అమ్మడి హెల్త్ పై వస్తున్న వార్తలు చూసి.. కాస్త టెన్షన్ పడ్డారు ఆమె అభిమానులు. సమంత కూడా ఇంటికే పరిమితం అవడం.. మరింత కంగారు పెట్టేలా చేసింది. అయితే ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చింది సమంత. తాజాగా ఆమె ముంబయి ఎయిర్ పోర్ట్‌లో కెమెరా కంట్లో పడింది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో.. కూలింగ్ గ్లాసెస్‌తో చాలా కూల్‌గా కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత వీడియో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన తర్వాత.. ఫుల్ ఖుషీ అవుతున్నారు ఆమె అభిమానులు.. క్వీన్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. అయితే సమంత యాక్టివ్‌గా మాత్రం కనిపించలేదు. కాస్త డల్‌గానే దర్శనమిచ్చింది. దాంతో అమ్మడి మొహంలో మునుపటి కళ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ త్వరలోనే సామ్ మళ్లీ నార్మల్ అవతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు.. రీసెంట్‌గానే డబ్బింగ్ స్టార్ట్ చేసింది సామ్. దాంతో ఈసినిమా ప్రమోషన్స్‌ను సామ్ గట్టిగానే చేస్తుందని అంటున్నారు. ఏదేమైనా సమంతను చూసి మురిసిపోతున్నారు అభిమానులు.