ప్రస్తుతం రాజమౌళి గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాయి హాలీవుడ్ వర్గాలు. అంతేకాదు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. జక్కన్న కూడా టాలీవుడ్ బిగ్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యానని చెబుతూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్తో వచ్చిన క్రేజ్‌తో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. అలాగే ఫ్రాంచైజ్ ప్లానింగ్‌లో కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు డెవలప్ చేస్తున్నారు. రాజమౌళి కూడా హాలీవుడ్ టూర్ ముగించుకున్నాడు. ఈ నెల 24వ తేది ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ఉంటుందో లేదో తేలిపోనుంది. అందుకే వీలైనంత త్వరగా మహేష్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాలని చూస్తున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్‌తో కమిట్ అయ్యాడు. ఎట్టకేలకు వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌ను తాజాగా స్టార్ట్ చేశారు. అయితే ఎట్టిపరిస్థితిలోను అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలని త్రివిక్రమ్‌ను తొందరపెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏకంగా 60 రోజుల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఆగస్టు 11వ తేదీన ఎస్ఎస్ఎంబీ 28 రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ లెక్కన ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు షూటింగ్ అవాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవాలి. అందుకే జెట్ స్పీడ్‌లో షూట్ చేయాలని చెప్పాడట మహేష్. పైగా రాజమౌళి తన సినిమా కోసం మహేష్‌ను సిక్స్ ప్యాక్ కావాలని అంటున్నాడట. దాంతో త్రివిక్రమ్‌కు టార్గెట్ ఫిక్స్ చేశాడట. మరి ఈసారైనా అనుకున్న సమయానికి ఎస్ఎస్ఎంబీ 28 పూర్తవుతుందేమో చూడాలి.