న్యాచురల్ స్టార్ నాని ఈసారి ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడు. అసలు నాని లుక్ చూసినప్పుడే దసరా మూవీ సమ్‌థింగ్ బిగ్ అనిపించింది. అందుకు తగ్గట్టే టీజర్ చూసిన తర్వాత దసరా మామూలుగా లేదని అనుకున్నారు. ఇక ఇప్పుడు ట్రైలర్ చూస్తే.. దసరా పై అంచనాలను పీక్స్‌కు వెళ్లిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన దసరా ట్రైలర్ అంచనాలకు మించి ఉంది.
న్యాచురల్ స్టార్ నాని ఈసారి ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడు. అసలు నాని లుక్ చూసినప్పుడే దసరా మూవీ సమ్‌థింగ్ బిగ్ అనిపించింది. అందుకు తగ్గట్టే టీజర్ చూసిన తర్వాత దసరా మామూలుగా లేదని అనుకున్నారు. ఇక ఇప్పుడు ట్రైలర్ చూస్తే.. దసరా పై అంచనాలను పీక్స్‌కు వెళ్లిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన దసరా ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. తెలంగాణ నేపథ్యంలో.. బొగ్గు గని బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ కే బాప్లా ఉండబోతున్నట్టు ట్రైలర్లో చూపించారు. బతుకమ్మతో గ్రాండ్‌గా ఓపెన్ అయిన ట్రైలర్.. వెన్నెల వచ్చిందరా.. అనే డైలాగ్‌తో మొదలైంది. కీర్తి సురేష్ ఊరమాస్ డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వెన్నెలగా కీర్తి సురేష్ అంగన్ వాడి టీచర్‌గా కనిపించింది. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. ధరణిగా నాని మేకోవర్, డైలాగ్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉన్నాయి. పది తలకాయలు ఉన్నోడే ఒక్క తలకాయ ఉన్నోని చేతిలో కుక్క చావు సచ్చిండు.. పురాణాలకు మించిన బతుకులా మనయి.. అనే డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. ఇక టీజర్ ఎండింగ్లో నాని ఊచకోత కోశాడు. వెన్నెల, కీర్తి మధ్య ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ముఖ్యంగా సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాని చెప్పినట్టుగానే దసరా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్‌గా నిలిచేలానే ఉంది. ట్రైలర్ ప్రకారం.. దసరా సినిమా ఊర్లో జరిగే ఆదిపత్య పోరుకు తిరుగు బాటులా ఉంది. సముద్రఖని కూడా డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. మొత్తంగా దసరా మూవీ హిట్ అయితే పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది.. లేదంటే నాని కెరీర్లోనే సరికొత్త అటెంప్ట్‌గా మిగిలిపోతుంది. కానీ దసరా ట్రైలర్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి.