»Naga Shaurya Says Ready With Ranga Bali Movie July 7th 2023 Release Date
Ranga Bali: రంగబలితో రెడీ అంటున్న నాగశౌర్య..!
యంగ్, ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య(Naga Shaurya) రంగబలి(Ranga Bali) అనే ఆసక్తికరమైన ప్రాజెక్టుతో మరోసారి మనముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి పరిచయం అవుతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్లతో తెరకెక్కనున్న ఈ మూవీ ఉగాది తర్వాత విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య(Naga Shaurya)కూడా ఒకరు. సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా రెడీగా ఉంటాడు. అలాంటి ఈ హీరోకి ఈ మధ్య హిట్లు కరువయ్యాయి. వరస ప్లాపులు సతమతం చేస్తున్నాయి. ఊహలు గుసగులాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో వరసగా రెండు, మూడు ప్లాప్ లు చూశాడు. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఇక ఇటీవలే ఓ ఇంటి వాడైన నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల శౌర్య నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇటీవలే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
ఇక ప్రస్తుతం ‘రంగబలి(Ranga Bali)’ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శౌర్య. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఈ సినిమా జులై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో నటించే హీరోయిన్ అండ్ ఇతర నటీనటుల వివరాలను తెలియాల్సి ఉంది. ఈ చిత్రం పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ తో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.