Custody Movie Full Review: కస్టడీ మూవీ ఫుల్ రివ్యూ
టాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న, తమిళ ప్రేక్షకులకు చైతన్య అక్కినేనిని పరిచయం చేస్తున్న తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు రచించి, దర్శకత్వం వహించిన చిత్రం కస్టడీ. ఈ మూవీ నేడు(మే 12న) తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిట్టా ఫట్టా చుద్దాం.
సినిమా – కస్టడీ నటీనటులు – నాగ చైతన్య, అరవింద్ స్వామి, కృతి శెట్టి, సంపత్ రాజ్, ఆర్.శరత్ కుమార్, ప్రియమణి, తదితరులు దర్శకుడు– వెంకట్ ప్రభు నిర్మాత – శ్రీనివాస చిట్టూరి సంగీతం – యువన్ శంకర్ రాజా, ఇళయరాజా రన్ టైమ్ – 2 గం 27 నిమిషాలు విడుదల తేదీ – మే 12, 2023
అక్కినేని నాగ చైతన్యకు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డాతో డీలా పడిపోయిన చైతూ.. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం చై ఆశలన్నీ కస్టడీ సినిమా పైనే ఉన్నాయి. ఈ క్రమంలో నేడు(మే 12న) ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. నాగ చైతన్యకు జోడీగా ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేసింది. బంగర్రాజు తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే. విలన్‌గా అరవింద్ స్వామి నటించాడు. తమిళ్ డైరెక్టర్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను మరింత హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లోనే చైతన్యను పవర్ ఫుల్ గా చూపించాడు. దీంతోపాటు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లాకప్ సీన్స్, పోలీస్ గెటప్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో కస్టడీ మూవీ చైతన్యకు ఎలాంటి విజయాన్ని అందించిందో ఇప్పుడు చుద్దాం.
కథ
శివ (నాగ చైతన్య) ఓ సిన్సియర్ యువ కానిస్టేబుల్. తనను లవ్ చేసిన యువతి రేవతి(కృతి శెట్టి)ని పెళ్లి చేసుకుని హ్యాప్పీగా ఉండాలని అనుకుంటాడు. ఆ క్రమంలో సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో రాజన్న(అరవింద స్వామి)ను ఉంచుతారు. అదే సమయంలో డ్యూటీలో ఉన్న శివకు రాజన్నను ఎవరో చంపేశారని తెలుస్తుంది. ఇంకోవైపు రేవతికి పెళ్లి ఫిక్స్ అయిందని మరోవార్త తెలుస్తుంది. ఆ నేపథ్యంలో సీబీఐ ఆఫీసర్ (సంపత్)ను శివ ఎలా ఎదుర్కొన్నారు. దీంతోపాటు పోకిరీ పోలీస్ ఆఫీసర్ (ఆర్.శరత్ కుమార్) మధ్య జరిగే సంఘటనలు ఏంటీ? అసలు రాజన్నను రెండు గ్రూపులు ఎందుకు చంపాలని చూశాయి? ఆ క్రమంలో రాజన్నకేసుతోపాటు రేవతి ప్రేమను శివ ఎలా కాపాడుకున్నాడు అనేది అసలు స్టోరీ.
ఎలా ఉందంటే
గతంలో డీసెంట్ చిత్రాలను అందించిన దర్శకుడు వెంకట్ ప్రభు కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 1996 నేపథ్యంలో సాగే ఈ చిత్రం రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో తెరకెక్కింది. కానిస్టేబుల్ శివ పరిచయం, రేవతి (కృతి శెట్టి)తో అతని ప్రేమ ఎపిసోడ్లు చాలా పాతవిగా అనిపిస్తాయి. వెన్నెల కిషోర్ పాల్గొన్న కామెడీ కూడా పేలవంగా అనిపిస్తుంది. మరోవైపు రాజన్న (అరవింద స్వామి), సీబీఐ ఆఫీసర్, శరత్ కుమార్ పాత్రలు ప్రవేశించిన తర్వాత, సినిమా కొంచెం వేగం పెరుగుతుంది. దీంతోపాటు ఛేజింగ్ ఎపిసోడ్లు కూడా ఎఫెక్టివ్ గా అనిపించవు. ఓవరాల్‌గా సెకండాఫ్ శివ ఫ్యామిలీ బ్యాక్ స్టోరీతో మొదలవుతుంది. తదనంతరం రాజన్న వెంబడించే పోకిరీ పోలీసులతో సినిమా సాగుతుంది.
ఎవరెలా చేశారు
శివ పాత్రలో నాగ చైతన్య నిజాయితీ గల పోలీసు పాత్రకు సరిగ్గా సరిపోయారు. ఇది వాస్తవికతకు దగ్గరగా కనిపించేలా అనిపిస్తుంది. శివ పాత్ర ఎక్కడా కూడా ఎలివేట్ చేసినట్లు అనిపించదు. మొత్తానికి చైతన్య తన క్యారెక్టర్ పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పవచ్చు. కృతి శెట్టికి మరొక పేలవమైన పాత్ర వచ్చింది. ఈ చిత్రంలో ఆమె గ్లామర్ కు స్కోప్ లేదు. నటనకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సాధారణంగా కనిపించి తన క్యారెక్టర్ మేరకు నటించింది. చాలా స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ పెద్దగా చెప్పుకునే సీన్లు లేవనే చెప్పవచ్చు. మరోవైపు ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు అరవింద్ స్వామి కీలక పాత్రలో యాక్ట్ చేశారు. అతను ఎంట్రీ సహా కొన్ని సీన్లు బాగుంటాయి. మిగిలిన వారిలాగే అతను కూడా తన మార్క్ చూపించాడు. శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్ తన బెస్ట్ ఇచ్చాడు. ఈ మూవీలో ప్రియమణి కూడా ఉంది. కానీ సినిమా మొత్తంలో కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. మరో నటుడు సంపత్ రాజ్. చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్‌లో గోపరాజు రమణ సహా తదితరులు పర్వాలేదనిపిస్తారు.
సాంకేతికం
సాంకేతికంగా సినిమా SR కతీర్ రియలిస్టిక్ సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. 90ల నాటి సెట్టింగ్ దృశ్యమానంగా మరింత మెరుగ్గా తీసి ఉండవచ్చు. కానీ యాక్షన్ కథనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఫర్వాలేదు. వెంకట్ రాజన్ ఎడిటింగ్ ఓకే. యాక్షన్-థ్రిల్లర్ కంటెంట్ ఇచ్చినప్పటికీ, కథనం మరింత బాగా తీస్తే బాగుండేది. మంచి కొరియోగ్రఫీతో ఎలివేట్ అవ్వాల్సిన యాక్షన్ బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో లేవు. మరోవైపు రచన ప్రభావవంతంగా లేదు. తెరకెక్కెంచిన సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. దీంతోపాటు ఆకట్టుకునే కథనాన్ని అందించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇళయరాజ్, యువన్ శంకర్ రాజా పాటలు విసుగును పెంచుతాయి. కథనంలో స్పీడ్ బ్రేకర్లుగా అనిపిస్తాయి. మొత్తం మీద వెంకట్ ప్రభుతో యువన్ కాంబో ప్రత్యేకత లేదనే చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్
నాగచైతన్య యాక్టింగ్
కొన్ని యాక్షన్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
బలహీనమైన కథనం
ఊహించదగిన సీన్స్
కొన్ని ఓల్డ్ సీన్స్
బీజీఎం, సాంగ్స్