మరో నెల రోజుల పాటు ఎక్కడ చూసిన జై శ్రీరామ్ నినాదం మాత్రమే వినిపించనుంది. జూన్ 16న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది ఆదిపురుష్(Adipurush). రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులన్నీ తిరగరాస్తోంది. దాంతో జోష్‌లో ఉన్న మేకర్స్ టికెట్స్ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ సినిమా సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవుతుందని మరింత నమ్మకం పెంచింది. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇప్పుడు ట్రైలర్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఈ సినిమా టికెట్స్ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఒక టికెట్ రేటుతో రెండు టికెట్లు.. అంటే ఒక టికెట్ కొంటే మరొకంటి ఉచితం అని ప్రకటించారు. పేటీఎం ద్వారా ఆదిపురుష్(Adipurush)టికెట్లు బుక్ చేస్తే.. ఈ ఫ్రీ ఆఫర్ సొంతం చేసుకోవచ్చని వెల్లడించారు.
అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ కోసం ముందుగా పేటీఎంలో 100 రూపాయలు చెల్లిస్తే.. ప్రొమో కోడ్ వస్తుంది. టికెట్ బుకింగ్‌కు ఆ ప్రొమో కోడ్‌ను అప్లై చేస్తే.. సగం క్యాష్‌బ్యాక్ వస్తుంది. మామూలుగా ఆదిపురుష్ సినిమా టికెట్లు రెండు బుక్ చేస్తే అయ్యే టోటల్ అమౌంట్లో.. పేటీఎం(paytm) ఆఫర్ కోడ్‌ను వినియోగిస్తే సగానికి తగ్గనుంది. ఈ ఆఫర్ కేవలం 350 రూపాయల కనీస ధర ఉన్న టికెట్ మీద మాత్రమే వర్తిస్తుందని టీ సిరీస్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
దీంతో ప్రభాస్(prabhas) ఫ్యాన్సే కాకుండా.. మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓం రౌత్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. మరి ఆదిపురుష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.